Padutha Theeyaga: మళ్ళీ మొదలు కానున్న పాడుతా తీయగా
June 5, 2021 / 06:08 PM IST
|Follow Us
పాడుతా తీయగా షో అంటే తెలియని తెలుగు సంగీత ప్రియులు ఉండరు. 1996 నుంచి ఈటీవి ఛానెల్ లో గ్యాప్ లేకుండా రెండు దశాబ్దాలు కొనసాగిన ఆ షో ద్వారా ఎంతో మంది సింగర్స్ వెలుగులోకి వచ్చారు. జడ్జి స్థానంలో ఉంటూ గాన గంధర్వుడు SP బాలసుబ్రహ్మణ్యం ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా రామోజీరావు ఆ షోను ఆపలేదు. ఇక గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మరణం తరువాత పాడుతా తీయగా మళ్ళీ ఉండదని అనుకున్నారు,
నిజానికి బాలు గారి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరనే చెప్పాలి. సంగీతం ప్రపంచంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఆయన తెలుగు భాషకు ప్రాముఖ్యతను చాలా ఇచ్చేవారు. ఈ జనరేషన్ లో పాటల్లో దోషాలు ఉన్నాయని వాటిని మార్చుకునే ప్రయత్నం చేయాలని కూడా రాబోయే తరాల వారికి నేర్పించేవారు. ఇక అలాంటి సంగీతం ప్రయాణం ఎప్పటికి ఆగిపోకూడదని బాలసుబ్రహ్మణ్యం చాలా సందర్భాల్లో చెప్పారు. రామోజీ రావు కూడా బాలు మాట ప్రకారం కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
బాలసుబ్రహ్మణ్యం స్థానంలో ఆయన తనయుడు ఎస్పీ.చరణ్ ను న్యాయ నిర్ణేతగా నియమించనున్నారట. అలాగే సింగర్ సునీతతో పాటు పాటల రచయిత చంద్రబోస్ ను కూడా జడ్జిలుగా నియమించినట్లు సమాచారం. ఈ ముగ్గురి ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం గారిని తలచుకుంటూ షోను మొదలు పెట్టనున్నారట. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ న్యాయ నిర్ణేతలు బాలు గారి స్థాయికి తగ్గట్లుగా షోను నడిపిస్తారో లేదో చూడాలి.