Director Sebastian: ‘నరకాసుర’ దర్శకుడికి సినిమా అంత ఇష్టమా… అంత జరిగినా… ముందుకొచ్చారా?
October 27, 2023 / 09:03 PM IST
|Follow Us
సినిమా గురించి కొందరు ప్రాణం ఇచ్చేస్తారు అంటుంటారు. అదెలా సాధ్యమబ్బా సినిమా గురించి దేనికైనా సిద్ధపడే జనాలు ఉన్నారా అనే డౌటు వస్తుంది. అయితే ఈ క్రమంలో కొంతమంది నటుల్ని, దర్శకుల్ని చూపిస్తే కచ్చితంగా పైన చెప్పిన మాట నిజమే అని ఒప్పుకుంటారు. తాజాగా అలాంటి ఓ దర్శకుడి గురించి టాలీవుడ్లో, సోషల్ మీడియాలో తెగ మాట్లాడుతున్నారు. ఆయనే ‘నరకాసుర’ సినిమాను తెరకెక్కించిన సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్. అవును, ఆయన ఈ సినిమా గురించి ఏం చేశారు అనే విషయం తెలిస్తే కచ్చితంగా ఆయన సూపర్ అంటూ తెగ పొగిడేస్తారు కూడా.
సెబాస్టియన్‌కు (Director Sebastian) సినిమా ఎంతో ప్యాషన్ అట. ఈ సినిమా ప్రారంభం సమయంలో ఆ విషయం చెప్పారు కూడా. సినిమా కథ, నేపథ్యం గురించి తెలిసినవాళ్లు కూడా ఈ మాట చెబుతారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగి చేయి కోల్పోయారట. అంత జరిగినా ఆయన ఎంతో పట్టుదలగా సినిమాను పూర్తి చేశారట. అదే ప్రమాదం వేరే వాళ్లకు జరిగి ఉంటే కచ్చితంగా సినిమాను వదిలేసేవారంటూ సినిమా టీమ్ మెచ్చుకుంటున్నారు.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే… ‘‘నువ్వు నిర్మించకున్న ఈ ప్రపంచంలో అంతా నీవాళ్లే. బయట ప్రపంచానికి మాత్రం నువ్వు అనాధవే. కొన్నిసార్లు దేవుళ్లు కూడా రాక్షసులుగా మారాల్సి వస్తుంది’’ అనే కాన్సెప్ట్‌లో నడుస్తుంది. అడవి సమీపంలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఆ గ్రామ ప్రజలకు అనుకోని ఆపద రాగా… పోరాడాల్సి వస్తుంది. ఆ సమస్య ఏంటి, దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేశారు అనేది తెరపై చూడాల్సిందే.
రక్షిత్ అట్లూరి హీరోగా అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో నవంబర్ 3 విడుదల చేస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.