Pakka Commercial Collections: ఫస్ట్ వీకెండ్ పర్వాలేదనిపించిన ‘పక్కా కమర్షియల్’ కలెక్షన్లు..!
July 4, 2022 / 01:52 PM IST
|Follow Us
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘జి ఎ 2 పిక్చర్స్’ ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ల పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 1 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తొలిరోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్లు రాబట్టింది.రెండో రోజు, మూడో రోజు కూడా ఓకే అనిపించింది.
రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సత్యరాజ్, సప్తగిరి, రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, చిత్ర శుక్ల మొదలైన వారు కీలక పాత్రలు పోషించారు. ఇక ‘పక్కా కమర్షియల్’ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
1.75 cr
సీడెడ్
0.88 cr
ఉత్తరాంధ్ర
0.92 cr
ఈస్ట్
0.52 cr
వెస్ట్
0.41 cr
గుంటూరు
0.47 cr
కృష్ణా
0.43 cr
నెల్లూరు
0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
5.68 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.28 cr
ఓవర్సీస్
0.72 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
6.68 cr
‘పక్కా కమర్షియల్’ చిత్రానికి రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అయితే చాలా ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు ఓన్ రిలీజ్ చేసుకున్నాయి. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15 కోట్లు గా ఉంది.ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.68 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో రూ.8.32 కోట్ల షేర్ ను రాబట్టాలి.మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ పర్వాలేదు అనిపించింది.కానీ వీక్ డేస్ లో కూడా స్టడీగా రాణిస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.