నా సినిమా టీజర్ నచ్చిందని ట్వీట్ చేసిన ప్యాన్ ఇండియా స్టార్స్!

  • May 5, 2023 / 11:02 AM IST

చిన్న సినిమాలకు పెద్ద హీరోల ప్రశంసలు వస్తే అది సగం సక్సెస్ అయినట్లే.. ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు స్టార్ హీరోలు, స్టార్ నిర్మాతలు సపోర్టు చేస్తున్నారు. ఆ సినిమాలు కూడా భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఏ సినిమాకైనా పెద్ద స్టార్‌ల ప్రశంసలు దక్కితే ఆ కిక్కేవేరు. ఆ సినిమాకు వచ్చే మైలేజ్‌ వేరు. అనుష్క శెట్టి, నవీన్‌ పోలిశెట్టి నటించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ టీజర్‌ చూసిన రామ్‌చరణ్‌ , ప్రభాస్‌ స్పందించారు.

టీజర్‌ నచ్చిందని సోషల్‌ మీడియా వేదికగా ఈ ప్యాన్‌ ఇండియా స్టార్స్‌ ఇద్దరూ పోస్ట్‌ చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ప్రభాస్‌, రామ్‌చరణ్‌ కూడా టీజర్‌ అదిరిందంటూ అభినందనలు తెలిపారు. అనుష్క చాలా రోజుల తర్వాత తెరపై కనిపించనున్న సినిమా కావడంతో తన అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రభాస్‌, రామ్‌చరణ్‌ శుభాకాంక్షలు సినిమా ఎసెట్‌ అయ్యేలా ఉంది.

ఈ టీజర్‌ను ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేసి వినోదాత్మకంగా ఉందని, టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘టీజర్‌ నాకు బాగా నచ్చింది. రిఫ్రెష్‌గా కనిపిస్తోంది’’ అని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టి స్టాండప్‌ కమెడీయన్‌గా, అనుష్క చెఫ్‌గా కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మహేష్‌ బాబు.పి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ టీజర్‌ బావుందంటూ రామ్‌చరణ్‌ చేసిన ట్వీట్‌ పట్ల ఆనందం వ్యక్తం చేశారు నవీన్‌ పోలిశెట్టి. ‘రామ్‌చరణ్‌ సర్‌ మీ ట్వీట్‌ చూశాక ఆనందంతో మేమంతా ‘నాటు నాటు’ స్టెప్‌ వేశాం’’ అని పేర్కొన్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus