విశేషాధరణ దక్కించుకుంటున్న ‘పంచతంత్రం’ టీజర్..!

  • November 27, 2021 / 02:16 PM IST

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్ల పై అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్ష పులిపాక దర్శకుడు.అతి త్వరలో థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను వదిలింది చిత్రబృందం. ‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం ఓ చోట కలుసుకున్నాయి.

ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు. చిరుత పెట్టిన పరుగు కథలు.. ఈగ చెప్పే బాహుబలి కథలు.. వినటానికి వచ్చిన వాటికి మైక్‌ దగ్గర ఒక ముసలి తాబేలు కలిసింది.కదలడానికే కష్టపడే నువ్వేం కథలు చెప్తావ్ అన్నాడు అక్కా.జవాబుగా ఆకాశమంత అనుభవంతో కథలు మొదలయ్యాయి.’ అంటూ సత్యదేవ్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ తో టీజర్ ను వదిలారు. 5 విభిన్న పాత్రలకు సంబంధించిన స్వభావాలు, అవి ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందినట్టు టీజర్ హింట్ ఇచ్చింది.

టీజర్ కు సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని కూడా కలిగించేలా ఈ టీజర్ ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!


టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus