‘ఉప్పెన’ తో తుఫాన్ సృష్టించేలా ఉన్నాడుగా..!

  • February 14, 2020 / 07:04 PM IST

మెగా ఫ్యామిలీ నుండీ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మరో కుర్రాడు వైష్ణవ్ తేజ్. మన సాయి తేజ్ తమ్ముడే ఇతను. గతంలో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ చిత్రమైన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రంలో వీల్ చైర్ లో కూర్చునే పిల్లాడు( శ్రీరామ చంద్రమూర్తి) పాత్ర పోషించాడు ఈ కుర్ర హీరో. ఇక వైష్ణవ డెబ్యూ చిత్రానికి ‘ఉప్పెన’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తుండడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఇక స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తుండడం అలాగే ఆయన శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకుడిగా పరిచయమవుతుండడం కూడా విశేషం. ఇప్పటి వరకూ హీరో వైష్ణవ్ తేజ్ మొహం చూపించకుండా వెనుక తిరిగి ఉండే లుక్స్ నే విడుదల చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు మొత్తం తన ఫేస్ ను రెవీల్ చేశారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కాబోతుంది.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus