Parasuram, Mahesh Babu: మహేష్ చిన్నపిల్లాడిలా ఎంజాయ్ చేశారు: పరశురామ్

  • May 15, 2022 / 06:03 PM IST

‘సర్కారు వారి పాట’ సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఈ సక్సెస్ ను ముందే ఊహించిన మహేష్ బాబు మొదటి రోజే తన దర్శకుడు పరశురామ్ కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు. సినిమా రిలీజ్ తరువాత మహేష్ బాబు ఫస్ట్ రియాక్షన్ ఇదేనని చెబుతున్నారు దర్శకుడు పరశురామ్. మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారని.. సినిమా విడుదలైన పొద్దున్నే 8 గంటలకు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారని తెలిపారు.

నిజానికి ఈ సక్సెస్ తనకు చాలా అవసరమని పరశురామ్ అన్నారు. అందుకే మహేష్ కంగ్రాట్స్ చెప్పారని.. అదే రోజు రాత్రి అందరం కలిసి పార్టీ చేసుకున్నామని చెప్పారు. మహేష్ అయితే చిన్నపిల్లాడిలా అయిపోయారని.. చిన్న పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా చేశారని తెలిపారు. ఇలా మహేష్ బాబు ఫస్ట్ రియాక్షన్ ను, ఆయన ఆనందాన్ని బయటపెట్టారు దర్శకుడు పరశురామ్. సినిమా సక్సెస్ అయినదానికంటే.. రెండేళ్ల తమ కృషికి గుర్తింపు దక్కిందనే ఆనందం తనలో ఎక్కువగా ఉందని చెప్పారు పరశురామ్.

సినిమా సక్సెస్ అయిన క్రమంలో మహేష్ బాబు మరోసారి తన రైటింగ్ ను మెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నారు పరశురామ్. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ టీమ్ మొత్తం సక్సెస్ సెలబ్రేషన్ మూడ్ లో ఉంది. గ్రాండ్ గా సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించబోతున్నారు. కొన్ని రోజుల పాటు ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేసి ఆ తరువాత కొత్త సినిమా పనులు మొదలుపెడతానని చెప్పారు పరశురామ్. మరో పక్క మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. రాగానే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించనున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus