Pareshan Review In Telugu: పరేషాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 2, 2023 / 05:12 PM IST

Cast & Crew

  • తిరువీర్ (Hero)
  • పావని కరణం (Heroine)
  • బన్నీ, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శ్రుతి రియాన్, రాజు బెడిగెల తదితరులు.. (Cast)
  • రూపక్ రోనాల్డ్సన్ (Director)
  • సిద్ధార్ధ్ రాళ్లపల్లి (Producer)
  • యశ్వంత్ నాగ్ (Music)
  • వాసు పెండెం (Cinematography)

“జాతిరత్నాలు, బలగం, మేమ్ ఫేమస్” చిత్రాలతో తెలంగాణ సంస్కృతి నేపధ్యంలో వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ పెరిగింది. ఆ జోనర్ లో వచ్చిన తాజా చిత్రం “పరేషాన్”. చిన్న సినిమా అయినప్పటికీ.. రాణా ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించి ప్రమోషన్స్ లో పాల్గొనడంతో సినిమా లైమ్ లైట్ లోకి వచ్చింది. అలాగే విడూదలైన టీజర్ & ట్రైలర్ కూడా సినిమా మీద మంచి అంచనాలు నమోదయ్యేలా చేశాయి. “కొబ్బరి మట్ట” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రూపక్ రోనాల్డ్సన్ తెరకెక్కించిన ఈ “పరేషాన్” ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: ఐసాక్ (తిరువీర్), పాషా (బన్నీ అబిరన్), మైదాక్ (రాజు బేడిగల), ఆర్జీవీ (రవి), సత్తి (అర్జున్ కృష్ణ).. వీళ్ళంతా గోదావరిఖని దగ్గరలోని ఒక గ్రామంలో నివసించే స్నేహితులు. కుదిరినప్పుడల్లా తాగడం, కుదరకపోతే ఊరంతా బలాదూర్ గా తిరగడం, అదీ లేకపోతే ఇంట్లో వాళ్ళతో తిట్లు తినడం. ఇదీ వీళ్ళ రోజు వారి పని.

ఐసాక్ ను ఎలాగైనా గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ చేయించాలని వాళ్ళ తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు. అందుకోసం రెండు లక్షల రూపాయలు డబ్బులు కూడా సర్ధుబాటు చేస్తారు. కానీ.. ఆ డబ్బుల్ని స్నేహితుల కోసం ఖర్చు చేసి.. ఆ డబ్బును మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడం కోసం ఐసాక్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? అనేది “పరేషాన్” మూల కథ.

నటీనటుల పనితీరు: తిరువీర్ మంచి థియేటర్ ఆర్టిస్ట్. అందువల్ల ఎలాంటి క్యారెక్టర్లో అయినా జీవించేస్తాడు. ఐసాక్ పాత్రలోను అదే తరహాలో ఒదిగిపోయాడు. ఒక సగటు యువకుడి పాత్రను తనదైన నటనతో పండించాడు తిరువీర్. అయితే.. ఈ క్యారెక్టర్ మాత్రం కాస్త అతడి వయసుకి మించి ఉంది. స్నేహితుల పాత్రధారులందరూ చక్కగా నటించినప్పటికీ.. మైదాక్, సత్తి పాత్రలు పోషించిన రాజు బేడిగల & అర్జున్ కృష్ణ మాత్రం బాగా ఎలివేట్ అయ్యారు.

ముఖ్యంగా అర్జున్ కృష్ణ నటన & బాడీ లాంగ్వేజ్ బాగా పేలింది. అతడికి మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పొచ్చు. పావని కిరణం, సాయి ప్రసన్నల పాత్రలు బాగున్నప్పటికీ.. వారి క్యారెక్టర్ ఆర్క్స్ కానీ వారి సన్నివేశాలు కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే స్థాయిలో లేవు. నటులుగా మాత్రం ఇద్దరూ అలరించారు. తెలంగాణ ఫాదర్ క్యారెక్టర్ కి కేరాఫ్ అడ్రస్ లాంటి మురళీధర్ గౌడ్ ఈ చిత్రంతో తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఎంత చిన్న సినిమా (Pareshan) అయినప్పటికీ.. టెక్నికల్ గా కొంచెమైనా బెటర్ మెంట్ కోరుకుంటారు ప్రేక్షకులు. అది సినిమాలో లోపించడం మైనస్ అని చెప్పాలి. లైటింగ్ ఎంత నేచురల్ అయినప్పటికీ.. కనీసం ఆర్టిస్టులు కనిపించని స్థాయి నేచురల్ లైటింగ్ ను ఎవాయిడ్ చేయడం బెటర్ అని దర్శకనిర్మాతలకు ఎందుకు అనిపించలేదో అర్ధం కాలేదు. అలాగే.. సగం సినిమా పొలాల్లో, ఇంక సగం గల్లీల్లో తీసేయడం వలన ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ కి పెద్దగా పని లేకుండా పోయిందనే చెప్పాలి. యశ్వంత్ నాగ్ సంగీతం మాత్రం బాగుంది.

సౌసారా పాట & ఆ ట్యూన్ తో వచ్చే నేపధ్య సంగీతం సినిమాకి మంచి హై ఇచ్చింది. ఇక దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ కొన్ని సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం బాగున్నా.. ఓవరాల్ గా కథను నడిపిన విధానం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఒకానొక సందర్భంలో ఏది మెయిన్ ప్లాట్ & ఏది సబ్ ప్లాట్ అనేది జనాలకి అర్ధం కాకుండాపోయింది. అలాగే.. కామెడీ కోసమని చర్చ్ ఫాదర్స్ మీద తీసిన మూడు నిమిషాల పాట సాగతీతలా అయిపోయింది కానీ ఆశాంతం నవ్వించలేకపోయింది.

సత్తి పాత్రను సినిమాకి మెయింట్ టర్నింగ్ పాయింట్ గా ఎంచుకున్న విధానం బాగున్నప్పటికీ.. కథనం కంటే పాత్రల వ్యవహారశైలి మీద ఎక్కువ శ్రద్ధ చూపించి తీరు బెడిసికొట్టింది. ఓవరాల్ గా రూపక్ రోనాల్డ్సన్ బొటాబోటి మార్కులతో నెట్టుకొచ్చాడు.

విశ్లేషణ: తెలంగాణ కల్చర్ అని తాగడం, మాంసం తినడం ఒక్కటే చూపిస్తున్నారు అని కొందరు ఈ సినిమాపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఆ అంశం పక్కన పెడితే.. ఒక కథను నడిపించే కథనం ఉంటే పాత్ర పాయింటాఫ్ వ్యూలో సాగాలి, లేదా చుట్టూ ఉన్న పరిస్థితుల నేపధ్యంలో సాగాలి. ఆ రెండు కాకుండా.. ఆ పాత్రల అలవాట్లతో నడిపించడం సినిమాకి మైనస్ అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే.. ఉన్న కొన్ని కామెడీ ట్రాక్స్, తిరువీర్ నటన & మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ కోసం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus