పరిణీతికి ఆ సీనియర్ హీరోయిన్ తో పడడంలేదట!

  • October 18, 2017 / 01:40 PM IST

ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెత ఊరికే పుట్టిందా చెప్పండి. అప్పుడప్పుడూ ఆడవాళ్ళు కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే.. మన హీరోయిన్లు మరీ అలా జుట్లు పట్టుకొని కొట్టుకోకపోయినా, ఇంచుమించు అదే స్థాయిలో మాటల యుద్ధం చేసుకొంటారు. ప్రస్తుతం బాలీవుడ్ బబ్లీ బ్యూటీ పరిణీతి చోప్రా మరియు బోల్డ్ బ్యూటీ టబు నడుమ ఆ మాటల యుద్ధమే నడుస్తోందట. వారిద్దరూ కలిసి నటించిన సినిమా “గోల్ మాల్ ఎగైన్”. దీపావళి సందర్భంగా 20వ తారీఖున విడుదలకానుంది. అయితే.. సినిమా ప్రమోషన్స్ కి పరిణీతి వస్తే టబు రాకపోవడం, టబు కనిపిస్తే పరిణితి అగుపించకపోవడంతో మీడియా ప్రతినిధులు ఎంక్వైరీ చేయగా.. సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరికీ చెడిందట.

పరిణీతి యాటిట్యూడ్ టబుకి నచ్చకపోవడం, టబు సీనియారిటీని పరిణీతి కేర్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యిందని చిత్ర బృందం చెప్పింది. ఈ ఇద్దరూ ఇలా కొట్టుకోవడం బానే ఉంది కానీ.. అసలే “దిల్ వాలే”తో దారుణంగా అభాసుపాలైన రోహిత్ శెట్టి మాత్రం సినిమా రిజల్ట్ ఏమవుతుందా అని తెగ టెన్షన్ పడుతున్నాడట. ఈ సినిమా కూడా అటకెక్కిందంటే.. రోహిత్ శెట్టి కెరీర్ ప్రశ్నార్ధకం కానుంది. మరి రిజల్ట్ ఏమిటో తెలియాలంటే ఇంకో రెండ్రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus