ప్యారిస్ ప్యారిస్ టీజర్ చూసి షాక్ అవుతున్న కాజల్ ఫ్యాన్స్

  • December 22, 2018 / 01:05 PM IST

నిన్న బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం “క్వీన్”కు రీమేక్స్ గా రూపొందుతున్న చిత్రాల టీజర్స్ విడుదలయ్యాయి. తెలుగులో తమన్నా నటిస్తున్న “దటీజ్ మహాలక్ష్మి”, తమిళంలో కాజల్ నటిస్తున్న “ప్యారిస్ ప్యారిస్”, కన్నడలో పరుల్ యాదవ్ నటిస్తున్న “బటర్ ఫ్లై”, మలయాళంలో మంజిమా మోహన్ నటిస్తున్న “జామ్ జామ్” టీజర్లు నిన్న విడుదలయ్యాయి. ఈ నాలుగు టీజర్లలో మలయాళం వెర్షన్ టీజర్ క్యూట్ గా ఉండగా.. కాజల్ నటించిన తమిళ వెర్షన్ టీజర్ మాత్రం వైరల్ అయిపోయింది.

అందుకు కారణం కంటెంట్ కాదని ఈపాటికే అందరికీ అర్ధమై ఉంటుంది. ఈ టీజర్ లో సహాయపాత్ర పోషించిన నటీమణి కాజల్ స్థానాన్ని పట్టుకొని ఒత్తడం వైరల్ అయ్యింది. 0.41 సెకన్ల దగ్గర ఉన్న ఆ క్లిప్పింగ్ ఇప్పుడు అన్నీ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు ఆల్రెడీ ఈ తరహా సన్నివేశాలు చేశారు కానీ.. కాజల్ లాంటి క్లాసీ హీరోయిన్ ఈ సన్నివేశం చేయడం, అది కూడా టీజర్ తో వదలడంతో కాజల్ అభిమానులు చాలా బాధపడుతున్నారు. నటనలో ఇవన్నీ కామన్ అయినప్పటికీ.. వాళ్ళు ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోతున్నారు.

                   

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus