లోక్ సభలో కృష్ణకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించిన ప్రధాని, స్పీకర్..!
December 7, 2022 / 05:59 PM IST
|Follow Us
సూపర్ స్టార్ కృష్ణ గారి మరణ వార్తను ఘట్టమనేని కుటుంబ సభ్యులు, వీరాభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన కృష్ణ గారి పెద్ద కర్మ కార్యక్రమంలో మహేష్ బాబు, సుధీర్ బాబు, కృష్ణ గారి తమ్ముడు ఆదిశేష గిరి రావు ఎమోషనల్ అవడంతో అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణ మరణంతో వీరాభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కడసారి చూసుకోవడానికి రాలేకపోయిన వారు పెద్ద కర్మ కార్యక్రమానికి విచ్చేసి..
ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఆ పిక్స్, వీడియోస్ వైరల్ అయ్యాయి.. ‘‘నాన్నగారు నాకు ఎన్నో ఇచ్చారు.. అందులో గొప్పది మీ అభిమానం.. అందుకు ఆయనకు రుణపడి ఉంటాను.. నాన్న గారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు.. మీ గుండెల్లోనూ ఉంటారు.. ఆయన ఎప్పుడూ మన మధ్యే ఉంటారు.. మీ అభిమానం, ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ తండ్రి కృష్ణ దశ దిన కార్యక్రమానికి వచ్చిన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు..
నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. సాంకేతికంగా కొత్త సొగసులు అద్దారు. దర్శక నిర్మాతగా, ఎడిటర్, స్టూడియో అధినేతగా ప్రభంజనం సృష్టించారు. నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా ఆయన ఎంతో చురుకుగా పాల్గొనేవారు. పార్లమెంట్ సభ్యుడిగా కృష్ణ ఎన్నో దశాబ్దాలు ప్రజా సేవ చేశారు. తాజాగా కృష్ణకు పార్లమెంట్ ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా మాట్లాడుతూ..
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వినూత్న ప్రయోగాలు చేస్తూ సాహసాలకు పెట్టింది పేరుగా కృష్ణ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.. ఆయన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, పేదలకు అండగా నిలిచారు.. అన్నారు.. కృష్ణ మృతికి సంతాప సూచికంగా లోక్ సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు..