Paruchuri Gopala Krishna: శ్రీశ్రీ గురించి పరుచూరి గోపాలకృష్ణ ఏమన్నారంటే…!

  • June 30, 2021 / 12:58 PM IST

మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గొప్పతనం గురించి ఎంత చెప్పినా చంద్రుడికి నూలిపోగు లాంటిదేనని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’ పేరుతో ఆయన ఓ పాడ్‌కాస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీశ్రీతో తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మీలాంటి అద్భుతమైన రచయితలు ద్వారా మేం ప్రజల్లోకి వెళ్లాలని’’ మేం రాసే మాటల్లోకి మీరు ఆవహించండి అని శ్రీశ్రీని తలచుకుంటూ సినిమాలు ప్రారంభించేవారట పరుచూరి బ్రదర్స్‌.

పద్యాలు, ఛందస్సు ఛందోబద్ధంగా ఉండాలని అలా వెళ్లిపోతున్న సమయంలో ఒక చిన్న నడకనే ఛందస్సులాగా మార్చి ‘మరో ప్రపంచం.. మరో ప్రపంచం.. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు.. పదండి తోసుకు.. పదండి పోదాం పైపైకి’ అంటూ దానికి ఒక రిథమ్‌ ఇచ్చారు శ్రీశ్రీ. ‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిల్లా కాదేదీ కవితకనర్హం’ అని కూడా అన్నారు. ఆయనది సామాన్యుడు మెచ్చే కవిత్వం, విద్యావంతుడు మెచ్చే కవిత్వం. అంటూ శ్రీశ్రీ కవిత్వం గురించి చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ.

ఓ సందర్భంలో పరుచూరి గోపాలకృష్ణ‘సార్‌.. మీరు నాకు ఆదర్శ రచయిత.. గొప్ప విప్లవ కవి’ అని అన్నారట. దానికి శ్రీశ్రీ స్పందిస్తూ.. ‘నేను విప్లవ కవిని కాను.. అభ్యుదయ కవిని’ అన్నారట. పరుచూరి బ్రదర్స్‌ మొత్తంగా తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహిస్తే… అందులో రెండు సినిమాలకు శ్రీశ్రీ రచనలు చేశారట. ‘ప్రజాస్వామ్యం’, ‘సర్పయాగం’ సినిమాలకు జూన్‌ 15న శ్రీశ్రీగారి వర్ధంతి రోజునే క్లాప్‌ కొట్టారట. ఆయన జ్ఞాపకార్థం ఆ రెండు సినిమాలను కావాలనే ఆ తేదీన ప్రారంభించారట.

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus