Saindhav: సైంధవ్ కు పరుచూరి రివ్యూ ఇదే.. అవే మైనస్ అయ్యాయట!
February 10, 2024 / 02:12 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ రచయితలలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తాజాగా సైంధవ్ మూవీ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సైంధవ్ వెంకీ 75వ సినిమా అని తన కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలవాలని వెంకీ ఈ సినిమా చేసి ఉండవచ్చని ఆయన అన్నారు. సైంధవ్ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. కూతురి పాత్ర బ్రతకకపోవడం ఈ మూవీకి మైనస్ అని ఆయన తెలిపారు.
నేను ఈ సినిమా కథ విని ఉంటే క్లైమాక్స్ విషయంలో పోరాడేవాడినని పరుచూరి వెల్లడించారు. ఆ పాప బ్రతుకుతుందని ఆశిద్దాం అనేలా క్లైమాక్స్ ను వదిలేసినా సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేదని పరుచూరి అభిప్రాయపడ్డారు. హాయ్ నాన్న సినిమాలో క్లైమాక్స్ పాజిటివ్ గా ఉండటంతో ఆ మూవీ సక్సెస్ అయిందని ఆయన వెల్లడించారు. మన భాషలో పెద్దగా పరిచయం లేని వాళ్లను విలన్ రోల్స్ కోసం ఎంపిక చేసుకోవడం రైట్ కాదని పరుచూరి పేర్కొన్నారు.
సైంధవ్2 సినిమా తీస్తే మాత్రం ఆ పాప బ్రతికిందనేలా చూపిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర విషయంలో కూడా లోపాలు ఉన్నాయని భర్త ఉన్నా మరో వ్యక్తి దగ్గర ఆమె ఉండటం రాంగ్ అని పరుచూరి వెల్లడించారు. సినిమాలో చూసిన సీన్లను మళ్లీ చూసిన అనుభవం కలుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మా నాన్న సూపర్ హీరో అని పాప చెప్పడంతో ఆ పాపకు ఏమీ కాదని భావించానని పరుచూరి వెల్లడించారు.
సైంధవ్ (Saindhav) సినిమాలో రసానుభూతి మిస్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు. మాఫియాను ఎదుర్కోవడం వెంకటేశ్ బాడీ లాంగ్వేజ్ కు అతకదు కానీ వెంకీ న్యాయం చేశారని పరుచూరి తెలిపారు. 17 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ను కొనుగోలు చేయడం సామాన్యమైన విషయం కాదని అయితే పీఎం అంగీకరించాడని చూపించడం ప్లస్ అయిందని ఆయన వెల్లడించడం గమనార్హం.