Custody: కస్టడీ సినిమా గురించి పరుచూరి షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?
July 3, 2023 / 07:44 PM IST
|Follow Us
నాగచైతన్య, కృతిశెట్టి కాంబినేషన్ లో వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన కస్టడీ సినిమా మే నెల 11వ తేదీన థియేటర్లలో విడుదలై యావరేజ్ రివ్యూలను సొంతం చేసుకుంది. అక్కినేని అభిమానులకు ఈ సినిమా నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా ఫెయిలైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సైతం రాలేదనే సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.
కస్టడీ మూవీ కథా బీజం అద్భుతంగా ఉందని న్యాయాన్ని నిలబెట్టడానికి పెద్ద అధికారుల అవసరం లేదని ఒక చిన్న కానిస్టేబుల్ కూడా న్యాయాన్ని నిలబెట్టగలడని ఈ సినిమాలో చూపించారని పరుచూరి అన్నారు. అద్భుతమైన స్టోరీ లైన్ తో ఈ సినిమా తెరకెక్కిందని ఒక దశ వరకు కథనం కూడా బాగుందని ఆయన చెప్పుకొచ్చారు. స్క్రీన్ ప్లేను యాక్షన్ పార్ట్ డామినేట్ చేసిందని ఆయన వెల్లడించారు.
కోలీవుడ్ ఆడియన్స్ కు అనుగుణంగా ఈ సినిమా తీశారని అనిపించిందని పరుచూరి పేర్కొన్నారు. ఈ సినిమాలో అరవింద స్వామి లుక్ కొత్తగా ఉందని అయితే ఆయనను చూస్తే ప్రేక్షకులకు లవర్ బాయ్ గుర్తొస్తాడని ఆయనకు బదులుగా మరొక నటుడిని తీసుకుని ఉంటే కథనం బెటర్ గా ఉండేదని పరుచూరి పేర్కొన్నారు. అక్కినేని హీరోల సినిమాలలో సాధారణంగా లవ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
కస్టడీ (Custody) సినిమాలో ప్రేక్షకులు ఆశించిన లవ్ యాంగిల్ కొరవడిందని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. చైతన్య బాడీ లాంగ్వేజ్ కు అవసరమైన లవ్ స్టోరీ మిస్ అయిందని ఆయన పేర్కొన్నారు. కస్టడీ మూవీలో అనవసరమైన లెంగ్తీ సీన్స్ ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫస్టాఫ్ లో చైతన్య కృతి మధ్య లవ్ సీన్స్ పెట్టి అకస్మాత్తుగా సమస్యను సృష్టించి ఉంటే కస్టడీ రిజల్ట్ మరోలా ఉండేదని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు.