Gopichand: ‘పక్కా కమర్షియల్’ లో ‘పటాస్’ పోలికలు..నిజమేనా!
June 22, 2022 / 04:32 PM IST
|Follow Us
‘సీటీమార్’ తో హిట్ అందుకుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు గోపీచంద్. అతని నుండీ రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’. మారుతి ఈ చిత్రానికి దర్శకుడు కాగా.. ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. పాటలు బాగున్నాయి, టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. ఈ మధ్యనే సినిమా రషెస్ చూసిన అల్లు అరవింద్ గారు..
‘సూపర్ హిట్ కొట్టేశావ్ మారుతి’ అంటూ దర్శకుడు మారుతి అభినందించారు. జూలై 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్లను మాత్రం నెల రోజుల ముందే స్టార్ట్ చేశారు. టీం మొత్తం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. అదీ కాక జూలై నెల గోపీచంద్ కు బాగా కలిసొచ్చిన నెల అని చెప్పాలి.’యజ్ఞం’ ‘లక్ష్యం’ వంటి గోపీచంద్ సినిమాలు ఇదే నెలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్నాయి. ‘సాహసం’ అనే చిత్రం కూడా పర్వాలేదు అనిపించింది.
అన్నీ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రంలో ‘పటాస్’ సినిమా పోలికలు ఉన్నాయి అనేది ఇన్సైడ్ టాక్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో కళ్యాణ్ రామ్ .. ఓ లంచగొండి పోలీస్ గా కనిపిస్తాడు. అతని తండ్రి సాయి కుమార్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. హీరోయిన్ మీడియాలో పనిచేస్తూ ఉంటుంది. ‘పక్కా కమర్షియల్’ లో గోపీచంద్ డబ్బు కోసం కేసులు వాదించే లాయర్.
డబ్బు కోసం క్రిమినల్స్ ను కూడా నిరపరాధి అని ప్రూవ్ చేస్తుంటాడు. ఇతని తండ్రి సత్యరాజ్ మంచి పేరు ఉన్న జడ్జి. ఇందులో హీరోయిన్ జూనియర్ ఆర్టిస్ట్. ‘పటాస్’ సినిమాలో మాదిరే ఈ మూవీలో కూడా హీరో ఓ ఇన్సిడెంట్ తో మంచి వాడు గా మారిపోతాడు. అయితే ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందింది అని తెలుస్తుంది.