ఒక సినిమా విజయం సాధించాలి అంటే అన్నీ కలసి రావాలి…కొన్ని సినిమాలు కధ పరంగా చాలా బావుంటాయి. కొన్ని సినిమాలు స్క్రీన్ప్లే పరంగా సూపర్ ఉంటాయి…మరి కొన్ని సినిమాలు కేవలం హీరోల పుణ్యమా అంటూ ఆడుతూ ఉంటాయి. అయితే ఆ కోవలోకి రాని లెక్క ఒకటి ఉంది అదేంటి అంటే కొన్ని సినిమాలు అన్ని రకాలుగా బావున్నా…కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ అనిపించుకుని పెద్దగా ఆదరణకు నోచుకోవు. అలాంటి సినిమాలు కధ పరంగా, కాంటెంట్ పరంగా నిజంగా చాలా అద్భుతమైన సినిమాలు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మూగబోయాయి…మరి ఆ సినిమాలో కొన్నింటిని, వారి కధకమామిని ఒక లుక్ వేద్దాం రండి.
జగడం (సుకుమార్)యువ హీరో రామ్…ఇషా సహాని హీరో హీరోయిన్స్ గా ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ, కమర్షియల్ గా మాత్రం పెద్ద హిట్ కాలేదు. ఈ సినిమాలో హీరో పాత్ర మన నిజ జీవితాలకు దగ్గరగా…చాలా న్యాచురల్ గా ఉంటుంది.
నేనింతే (పూరీ జగన్నాధ్)మాస్ మహారాజా రవి తేజ హీరోగా పూరీ తెరకెక్కించిన ఈ చిత్రం సినిమా పరిశ్రమ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అయితే ఈ సినిమాలో స్క్రీన్ప్లే, డైలాగ్స్ పూరీ కరియర్ లోనే బెస్ట్ అనే చెప్పాలి. అయితే సినిమా మాత్రం పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు రాల్చలేదు అనే చెప్పాలి.
బాణం (చైతన్య దంతులూరి)టాలీవుడ్ కి యువ హీరో నారా రోహిత్ ను అందించిన అవకాశం ఈ సినిమాకు దక్కుతుంది. నక్సలైట్ కొడుకుగా సొసైటీలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చాలా స్పష్టంగా చూపించాడు దర్శకుడు. ఇక నారా రోహిత్ యాక్టింగ్ అయితే అందరినీ మెస్మరైజ్ చేసేస్తుంది. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చప్పుడు చెయ్యలేదు.
నేను మీకు తెలుసా (అజయ్ శాస్త్రి)ఒక సరికొత్త కాదాంశంతో ఆధ్యంతం స్క్రీన్ప్లే తో కట్టి పడేసిన సినిమా నేను మీకు తెలుసా. ఈ సినిమాలో హీరోకి ఉన్న ప్రాబ్లమ్ ని ఎక్కడా ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా చూపిస్తాడు దర్శకుడు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ గా మిగిలింది.
అందమైన మనసులో (ఆర్పీ పట్నాయక్)ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ మెగా ఫోన్ తో చేసిన మరో మంచి ప్రయత్నం అందమైన మనసులో. ప్రేమకు వయసు ఎప్పుడూ అడ్డుకాదు అన్న విషయాన్ని చాలా అందంగా చూపించాడు ఆర్పీ. అయితే సినిమా మాత్రం చాలా మందికి తెలియకుండానే తెరమరుగు అయిపోయింది.
ప్రస్థానం (దేవ్ కట్టా)రాజకీయం గురించి, రాజకీయ ప్రస్థానం గురించి చాలా క్లుప్తంగా, ఆ పరిస్థితులను వివరించాడు దర్శకుడు. అంతేకాకుండా ఈ సినిమాలోని డైలాగ్స్ చాలా న్యాచురల్ గా పొలిటికల్ పర్సన్స్ ఎలా ఉంటారో చూపిస్తాయి. అవార్డ్స్ పరంగా, విమర్శల పరంగా ఈ సినిమా ఎన్నో అందుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం సినిమా పెద్దగా ఆకట్టుకొలేదు అనే చెప్పాలి.
యువకుడు (కరుణా కరణ్)అక్కినేని నాగేశ్వరరావు వారసుడు సుమంత్ కరియర్ లో మంచి సినిమాల్లో ఈ సినిమా ఒకటి. మంచి ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.
కధ (రాగ శ్రీనివాస్)జెనీలియా ప్రధాన పాత్రలో మంచి థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా, మాస్ సినిమాలకన్నా చాలా బావుంటుంది. అయితే కమర్షియల్ గా మాత్రం పెద్దగా ఆడలేదు.
కో అంటే కోటి (ఆనిష్ కురువిల్ల)యువ హీరో శర్వానంద్ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సినిమాలో హీరో పాత్ర మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం మాత్రం రాల్చలేకపోయింది.
నిజం (తేజ)ప్రిన్స్ మహేష్ తో అవినీతిపై తేజ సంధించిన నిజం అనే బాణం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు…ప్రిన్స్ కి నంది పురస్కారాన్ని అందించింది. అయితే కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మూగబోయింది.
ఆరేంజ్ (బొమ్మరిల్లు భాస్కర్)ప్రేమ గురించి మంచి లైన్ తీసుకుని తెరకెక్కించిన సినిమా ఆరెంజ్. అయితే ఇప్పటికీ ఈ సినిమా మ్యూజిక్ అంటే మ్యూజిక్ లవర్స్ కి ప్రాణం. మ్యూజిక్ పరంగా మెస్మరైజ్ చేసిన ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం నిర్మాత నాగబాబుని కోలుకోలేని దెబ్బ తీసింది.
నేనొక్కడినే (సుకుమార్)ప్రిన్స్ మహేష్ కరియర్ లో సరికొత్త ప్రయోగంతో తెరకెక్కిన సినిమా ఇది. చాలా మంది నుంచి వచ్చిన విమర్శల ప్రకారం ఈ సినిమా అర్ధం కాలేదు, కన్ఫ్యూషన్ గా ఉంది అని. అయితే ఇలాంటి సినిమాలను డీల్ చెయ్యడం నిజంగా దర్శకుడు సాహసానికి మెచ్చుకోవాలి. సినిమా పరంగా మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కమర్షియల్ గా దెబ్బ తిన్న సినిమా ఇది.
అందరిబంధువయా (చంద్ర సిద్దార్థ)మానవత్వ విలువల గురించి అందంగా చూపించిన చిత్రం అయితే సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ గా మిగిలిపోయింది.
అనుకోకుండా ఒక రోజు (చంద్రశేఖర్ ఏలేటి)ఆద్యంతం కట్టి పడేసే స్క్రీన్ప్లే. అడుగడుగునా ట్విస్ట్స్, మంచి కధ, ఇంట్రెస్టింగ్ పాయంట్ అన్నీ వెరసి ఈ సినిమా విమర్శకుల మన్నలను పొందింది. అవార్డ్స్ ను సైతం పొందింది. అయితే కమర్షియల్ గా మాత్రం పెద్దగా ఆడలేదు.
పిల్ల జమింధార్ (జీ. అశోక్)మనిషి, మానవత్వ విలువలు, డబ్బు, ఎలా బ్రతకాలి…ఎలాంటి బ్రతుకు బ్రతకాలి అన్న చిన్న చిన్న విషయాలను చాలా అందంగా చిత్రీకరించారు. సినిమా అధ్యంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. కానీ కమర్షియల్ గా మాత్రం పెద్దగా హిట్ కాలేదు.