Pathaan: వందల కోట్ల ‘పఠాన్’ వెనుక ఇంత కథ నడిచింద!
February 6, 2023 / 12:07 PM IST
|Follow Us
షారుఖ్ ఖాన్ ఏజ్ గురించి మాట్లాడితే అభిమానులకు కోపం వస్తుంది కానీ.. ఆయన సినిమా గురించి, ఆయన గురించి గొప్పగా చెప్పే క్రమంలో ఏజ్ ఫ్యాక్టర్ వాడక తప్పడం లేదు. కాబట్టి చూసీ చూడనట్లు వదిలేయండి. అసలు విషయం ఏంటంటే.. ‘పఠాన్’ సినిమా చూశాక.. షారుఖ్ ఏజ్‌కి ఈ పాత్ర ఒప్పుకోవడం, ఇలాంటి కథను ఓకే చేయడం అంత ఈజీ కాదు అని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ అంత వైల్డ్‌గా ఉన్నాయి మరి. అసలు ఈ కథను షారుఖ్‌కి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఎలా చెప్పి ఒప్పించారు అనేది మరో ప్రశ్న.
ఈ రెండు ప్రశ్నలకు ఇటీవల సమాధానం వచ్చింది. ఈ సినిమా కథను షారుఖ్ ఖాన్‌కు దర్శకరచయత సిద్ధార్థ్ ఆనంద్ చెప్పలేదట. అదేంటి ఆయనే చెప్పాలి కదా? అంటారా. అవును మీరు అన్నది కరెక్టే… కానీ ఇక్కడ సినిమా గురించి షారుఖ్ ఖాన్‌కి చెప్పింది నిర్మాత అట. ఓకే చేయించుకున్నది కూడా ఆయనే. అవును యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాత ఆదిత్య చోప్రానే ‘పఠాన్’ కథను షారుఖ్ ఖాన్‌కు వినిపించి, ఓకే చేయించుకున్నారట.
సిద్ధార్థ్ ఆనంద్ చాలా కాలంగా షారుఖ్ ఖాన్‌తో ఓ సినిమా చేయాలి అనుకున్నారట. అందులోనూ ఆ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా ఉండాలి అని ఫిక్స్ అయ్యారట. అందుకే షారుఖ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘పఠాన్’ సినిమా కథ రెడీ చేశారట. స్టోరీ పూర్తయ్యాక నిర్మాత ఆదిత్య చోప్రాకు వివరించారట. కథ బాగా నచ్చింది, వెంటనే చేసేద్దాం, హీరో ఎవరనుకుంటున్నావ్ అని అన్నారట. దానికి సిద్ధార్థ్ ‘షారుఖ్ ఖాన్’ అన్నారట. అంతేకాదు ఆయనను ఒప్పించే పని మీరే చేయాలి అని బరువు ఆదిత్య భుజాన పెట్టేశారట.
దీంతో ఒకరోజు ఆదిత్య చోప్రా, షారుఖ్ ఖాన్ కలిశారట. క్యాజువల్‌గా మొదలైన మీటింగ్‌లో కాసేపటికి షారుఖ్ మూడ్ బాగుందని తెలిసి ‘పఠాన్’ కథ గురించి చెప్పారట. షారుఖ్ స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారట. వెంటనే ఆదిత్య చోప్రా సిద్ధార్థ్‌కు ఫోన్ చేసి షారుఖ్ ఓకే అన్నాడు అని చెప్పారట. ఇదీ సినిమాను షారుఖ్‌కి చెప్పిన విధానం, ఆయన ఓకే చేసిన విధానం అని సిద్ధార్థ్ ఆనంద్ చెప్పారు.