Pavala Syamala: స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పావలా శ్యామల!

  • November 20, 2022 / 06:55 PM IST

ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న సెలబ్రిటీలలో పావలా శ్యామల ఒకరు. పావలా శ్యామలకు ప్రస్తుతం సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు. పావలా శ్యామల గొంతెమ్మ కోర్కెలు కోరుతుండటం వల్లే తాము సహాయం చేయలేకపోతున్నామని గతంలో పలువురు సెలబ్రిటీలు ఆరోపణలు చేశారు. తాజాగా పావలా శ్యామల స్టార్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తనకు సహాయం చేయడంతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం ఇప్పించారని ఆమె అన్నారు.

చిరంజీవి గారు ప్రతి నెలా నాకు కొంత మొత్తం అందే విధంగా సహాయం చేస్తున్నారని పావలా శ్యామల కామెంట్లు చేశారు. చిరంజీవి చేసిన సహాయాలను నేను ఎప్పటికీ మరిచిపోనని ఆమె చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసిన సహాయానికి నేను రుణపడి ఉంటానని పావలా శ్యామల పేర్కొన్నారు. అదే సమయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు తనకు పది లక్షల రూపాయలు ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆ వార్తలు ఫేక్ అని ఆమె కామెంట్లు చేశారు.

ఈ విధంగా జరుగుతున్న ప్రచారం వల్ల నాకు సహాయం చేయాలని అనుకున్న వాళ్లు సైతం సహాయం చేయడం లేదని పావలా శ్యామల వెల్లడించారు. వాస్తవానికి టాలీవుడ్ స్టార్స్ పావలా శ్యామలకు సహాయం చేసినట్టు వార్తలు ఎక్కడా ప్రచారంలోకి రాలేదు. కానీ పావలా శ్యామల మాత్రం క్రేజ్ ఉన్న స్టార్ హీరోల పేర్లతో పబ్లిసిటీ చేసుకోవాలని అనుకుంటున్నారు.

పావలా శ్యామల బిహేవియర్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే పావలా శ్యామల కష్టాలను ఎదుర్కొంటున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. కొంతమంది పావలా శ్యామల గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus