శ్రీరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన నటి పవిత్ర లోకేష్
June 26, 2018 / 06:12 AM IST
|Follow Us
అలనాడు హీరోయిన్ గా అలరించిన పవిత్ర లోకేష్.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా నటిస్తూ అభినందనలు అందుకుంటున్నారు. ఆమె తాజాగా కాస్టింగ్ కౌచ్ అంటూ వార్తల్లో నిలుస్తున్న శ్రీ రెడ్డి లాంటి వారిపై సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. ” కాస్టింగ్ కౌచ్ చాలా సున్నితమైన అంశం. ఈ విశ్వంలో ఆడ, మగ జాతులు ఉన్నాయి. ఆడవాళ్లు మగవాళ్ళని, మగవాళ్లు ఆడవాళ్ళని ఉపయోగించుకోవడం అనేది అన్ని రంగాల్లో ఉంది.” అని పవిత్ర అన్నారు. “ఈ ప్రపంచంలో సినిమా అనేది చాలా చిన్న విషయం. బ్రతకడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేయాలా?వద్దా? అనేది మన ఛాయిస్. మనం అంగీకరిస్తేనే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు.
అసలు ఈ వ్యవహారానికి కాస్టింగ్ కౌచ్ అంటూ చాలా పెద్ద పేరు పెట్టారు. పరిణితి చెందిన ఇద్దరు ఆడ, మగ మధ్య జరిగిన వ్యవహారం గురించి ఎందుకు ఇంత రచ్చ. దీనికి అంగీకరిస్తున్న వారంతా 4, 5 ఏళ్ళు ఉన్న చిన్నారులా?. ఎదో ఆశించే ఈ ఆ పనికి ఒప్పుకుంటున్న వారే. మళ్ళీ కాస్టింగ్ కౌచ్ అంటూ గేమ్ ఆడుతున్నారు” అని పవిత్ర ముక్కుసూటిగా మాట్లాడారు. ఆమె మాటలపై శ్రీరెడ్డి స్పందించింది. పవిత్ర పేరు వెల్లడించలేదు కాబట్టి.. శ్రీ రెడ్డి కూడా పరోక్షంగానే స్పందించింది. “పతివ్రతలా మాట్లాడడం ఆపండి. మీరు ఎం చేసారో మీకు తెలుసు. కానీ సమాజానికి భయపడే ఇలా మాట్లాడుతున్నారు” అని కౌంటర్ ఇచ్చింది.