అన్ స్టాపబుల్ సీజన్2 కు పవన్ హాజరు కానున్నారా?

  • September 18, 2022 / 07:33 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా మరికొన్ని రోజుల్లో ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ సీజన్2 ప్రారంభం కానుండగా ఈ షో కోసం బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్1 ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన నేపథ్యంలో అన్ స్టాపబుల్ సీజన్2 కూడా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అన్ స్టాపబుల్ సీజన్2 కు పవన్ – త్రివిక్రమ్ రానున్నారని తెలుస్తోంది.

అల్లు అరవింద్ ప్రయత్నించడంతో పవన్, త్రివిక్రమ్ ఈ షోకు రావడానికి అంగీకరించారని బోగట్టా. ఈ నెల 26వ తేదీ నుంచి అన్ స్టాపబుల్ సీజన్2 షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. దుబాయ్ లేదా టర్కీలో ఓపెనింగ్ షాట్ ను షూట్ చేయనున్నారని బోగట్టా. బాలయ్యషోకు పవన్ త్రివిక్రమ్ హాజరైతే అటు బాలయ్య అభిమానులు ఇటు పవన్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తారు. అన్ స్టాపబుల్ సీజన్2 కు సరైన గెస్ట్ లు ఉండాలనే ఆలోచనతో ఈ షో నిర్వాహకులు గెస్ట్ ల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

క్రేజ్ ఉన్న సెలబ్రిటీలు హాజరైతే షోకు కూడా క్రేజ్ రావడంలో సందేహం అవసరం లేదని షో నిర్వాహకులు భావిస్తున్నట్టు బోగట్టా. అన్ స్టాపబుల్ సీజన్2 కోసం భారీ స్థాయిలో ఈ షో నిర్వాహకులు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ షో సక్సెస్ సాధిస్తే అన్ స్టాపబుల్ సీజన్3 దిశగా కూడా అడుగులు పడే ఛాన్స్ అయితే ఉంటుంది.

సినిమాల్లో, రాజకీయాల్లో సక్సెస్ అయిన బాలకృష్ణ హోస్ట్ గా కూడా సక్సెస్ కావడం అభిమానుల సంతోషానికి కారణమవుతోంది. మరోవైపు బాలయ్య మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మల్టీస్టారర్ సినిమాలపై బాలయ్య ఆసక్తి చూపిస్తారో లేదో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus