వకీల్ సాబ్ హిందీ చిత్రం పింక్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఓ వృద్ధ లాయర్ ఓ ముగ్గురు యువతుల్ని చట్టపరంగా ఓ కేసు నుండి ఎలా కాపాడాడు అన్నదే కథ. సమాజంలో యువతుల పట్ల కొందరికి ఉండే భావన.. ఆడవారి హక్కులు, లైంగిక పరమైన విషయాలలో వారి అభిప్రాయానికి విలువ వంటి విషయాలను ప్రస్తావిస్తూ తెరకెక్కినదీ ఈ చిత్రం. ఓ చక్కని సామజిక అంశాన్ని అద్భుతమైన సంఘటనలు, సన్నివేశాల సమాహారంగా తెరకెక్కించడంతో పింక్ సూపర్ హిట్ గా నిలించింది.
ఇక మానసిక రుగ్మతతో బాధపడే వయసుమళ్ళిన లాయర్ గా అమితాబ్ వయసుకు దగ్గ పాత్ర చేశారు. ఇక ఇదే చిత్రాన్ని తమిళంలో అజిత్ చేయడం జరిగింది. కొన్ని కమర్షియల్ అంశాలు జోడించి తీసిన నెర్కొండ పార్వై అక్కడ విజయం సాధించింది. దీనితో ఈ చిత్రాన్ని పవన్ చేయడానికి ఒప్పుకున్నారు. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీస్తే పొలిటికల్ గా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అందుకే ఆయన ఈ సబ్జెక్టు ఎంచుకున్నారు. అంత వరకు ఓకే మరి పవన్ అభిమానుల సంగతి ఏమిటీ..? పవన్ ఫ్యాన్స్ అసలు ఇలాంటి చిత్రాన్ని చూస్తారా అనేది పాయింట్. పవన్ ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సోషల్ మెస్సేజ్ మూవీ చేసింది లేదు. కమర్షియల్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ ఆయనకు అంతటి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. మరి పవన్ ఇమేజ్ కి విరుద్ధంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఎంత వరకు విజయం సాధిస్తుంది..?