రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు వైసీపీ మంత్రుల నుంచి కౌంటర్లు వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన సినిమా నిర్మాతకు సైతం కొన్నిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళుతున్నానని చెప్పినట్టు సమాచారం. అయితే కొంతమంది టాలీవుడ్ హీరోల నుంచి పవన్ వ్యాఖ్యలకు సపోర్ట్ లభిస్తోంది. తన ప్రసంగంలో నాని, ఎన్టీఆర్, చరణ్, రానా, ప్రభాస్ పేర్లను పవన్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
అయితే నాని మినహా మరే స్టార్ హీరో నుంచి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ లభించలేదు. కార్తికేయ, దేవ కట్టా స్పందించినా స్టార్ హీరోలు స్పందిస్తే మాత్రమే పవన్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయపరమైన విమర్శలు చేయడంతో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో జగన్ ఈ విమర్శలపై స్పందించే అవకాశం ఉంది. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో ఏపీలో కొత్త జీవో అమలులోకి వచ్చింది.
ఏప్రిల్ 9వ తేదీ నుంచి రాష్ట్రంలో తగ్గిన టికెట్ రేట్లు అమలవుతున్నాయి. పవన్ చేసిన కామెంట్ల వల్ల పవన్ భవిష్యత్తు సినిమాలకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా హరిహర వీరమల్లు సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. తన సినిమాలకు ఇబ్బందులు ఎదురైతే పవన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!