కళ్యాణ్ బాబు నన్ను కొట్టలేదు: షకలక శంకర్

  • March 19, 2016 / 10:50 AM IST

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో హాస్య నటుడు షకలక శంకర్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండగా .. షూటింగ్ లో శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చాడని వస్తున్న వార్తలపై శంకర్ స్పందించాడు. ‘ పవన్ కళ్యాణ్ నాకు దేవుడుతో సమానం. ఈ విషయం అందరికీ తెలుసు. పవనే వ్యక్తిగతంగా నన్ను పిలిచి సర్దార్ చిత్రంలో నాకు అవకాశం కల్పించాడు.

మేమిద్దరం కలిసి దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాం. సెట్స్ లో సరదాగా ఉండేవారు. నన్ను పాటలు పాడమని అడిగేవారు. నేను పాడే చేపలపులుసు పాట పవన్ కు నచ్చుతుంది. నేను ఏదైనా సీన్ లో సరిగా నటించకపోతే బాగా నటించమని హెచ్చరించే వాడు. అంతే తప్ప నన్ను పవన్ కొట్టలేదు. నేను ఇతర విషయాల్లో జోక్యం చేసుకోను. నేను సెట్స్ లోకి వచ్చి నాపని చేసుకొని వెళ్తాను. ఈ విషయం చిత్ర బృందంలో ఎవరిని అడిగినా చెపుతార’ని శంకర్ తెలిపాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus