Pawan Kalyan: పవన్‌ ఇన్‌స్టా స్టామినా చూశారు… ఫేక్‌ అకౌంట్‌ లెక్కలు తెలుసా?

  • July 5, 2023 / 05:38 PM IST

సినిమాల్లో పవన్‌ కల్యాణ్‌ స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా క్లిక్‌ అయితే వసూళ్లు ఏ రేంజిలో ఉంటాయో లెక్కలు అవసరం లేదు. తాజాగా పవన్‌ తన స్టామినాను సోషల్‌ మీడియాలో కూడా చూపించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్‌ ఎంట్రీ ఏ లెవల్‌లో ఉందో మీరు ఇప్పటికే చూసి ఉంటారు. ఈ వార్త రాసే సమయానికి పవన్‌ కల్యాణ్‌ ఇన్‌స్టా అకౌంట్‌ను సుమారుగా 1.8 మిలియన్ల మంది.. అంటే సుమారు 18 లక్షలమంది ఫాలో అవుతున్నారు. అయితే ఆయన అకౌంట్‌ కానివాటిని కూడా భారీ స్థాయిలో ఫాలోవర్స్‌ ఉన్నారని తెలుసా?

చాలామంది హీరోలకు ఉన్నట్లే (Pawan Kalyan) పవన్‌ కల్యాణ్‌ కూడా ఇంచుమించు అదే పేరుతో ఇన్‌స్టాలో ఫేక్‌ ఖాతాలు ఉన్నాయి. పవన్‌ కల్యాణ్‌ కొణిదెల అనే అకౌంట్‌ను సుమారు 3.84 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక పవన్‌కల్యాణ్‌ కె అనే మరో అకౌంట్‌ను సుమారు 3.58 లక్షల మంది అనుసరిస్తున్నారు. Pspk.in అనే మరో అకౌంట్‌కి అయితే సుమారు 1.64 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇవి ఆయన ఫేక్‌ ఖాతాల లిస్ట్‌లో ఓ మూడు మాత్రమే. ఇలాంటి చాలా ఉన్నాయి.

అయితే ఇప్పుడు పవన్‌ ఒరిజినల్‌ అకౌంట్‌ వచ్చిన నేపథ్యంలో ఆయన టీమ్‌ ఏమైనా దీని మీద దృష్టిసారించి ఆ అకౌంట్లను క్లోజ్‌ చేసే పనిలో పడుతుందేమో చూడాలి. అభిమాన హీరో ఏం పోస్ట్‌ చేశాడు అనేది చూద్దామని సెర్చ్‌ చేసే ప్రయత్నం పవన్‌ ఫ్యాన్స్‌ చేస్తే.. ముందు ఈ అకౌంట్స్‌ వస్తుండటం గమనార్హం. ఇక ఒరిజినల్‌ అకౌంట్‌ సంగతి చూస్తే.. దీనికి గత నెలలో క్రియేట్‌ చేశారు. ఈ నెల అఫీషియల్‌గా లైవ్‌ చేశారు. ఇప్పటికే ఓసారి యూజర్‌ నేమ్‌ను మార్చారు కూడా.

‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .. జై హింద్!” అనే స్లోగన్‌ను పవన్‌ ఇన్‌స్టా ఖాతాలో బయోగా పెట్టుకున్నాడు. అంతకుమించి ఏం సమాచారం లేదు. దీంతో తొలి పోస్ట్‌ ఏమై ఉండొచ్చు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సినిమాకు మాత్రమే పరిమితం చేస్తాడా? లేక జనసేన రాజకీయాలు కూడా ఇందులో ఉంటాయా అనేది చూడాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus