ఒక హీరోని అభిమానించడం అంటే ఆ హీరో యొక్క మంచి మార్గాన్ని అనుసరించడం అనేది ఒకప్పటి మాట…ఇప్పుడు హీరోని అభిమానించడం అంటే… ఒక వర్గాన్ని పెంచి పోషించడం, ఒక కులాన్ని సపోర్ట్ చెయ్యడం అన్న స్థితికి మన అభిమానం దిగజారిపోయింది….అసలు విషయం ఏంటి అంటే…పవన్ కల్యాణ్ ఇప్పుడు హీరో మాత్రమే కాదు…ఆయనో రాజకీయ నాయకుడు కూడా…అయితే రాజకీయ శక్తిగా ఎదగాలి అని కలలు కంటున్న పవన్ కు ఆయన ఫ్యాన్స్ గొప్ప బలం అనే చెప్పాలి…అయితే అదే ఫ్యాన్స్ వల్ల ఇప్పుడు పవన్ కు చెడ్డ పేరు వస్తుంది…విషయంలోకి వెళితే…పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు. కాటమరాయుడు సినిమా విడుదల సందర్భంగా ఓ ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న పవన్ ఫ్యాన్స్ స్టూడియో లైవ్ లోనే రచ్చ రచ్చ చేశారు. మా హీరో సినిమా కు ఇంత తక్కువ రేటింగ్ ఇస్తావా అంటూ మండిపడ్డారు. ఏకంగా లైవ్ లోనే యాంకర్ పై దాడి చేశారు. యాంకర్ టేబుల్ పై ఉన్న వస్తువులను నేలకేసి బాదారు. కుర్చీలను ఎత్తేశారు.. యాంకర్ పై కలబడ్డారు. నానా హంగామా చేసేశారు..
మన కాసేపు నిజం మాట్లాడుకుంటే….కాటమ రాయుడు సినిమాపై డివైడ్ టాక్ నడుస్తోంది. సినిమా యావరేజ్ అని ఇట్టే అర్ధం అవుతుంది… ఈ సినిమాపై దాదాపు అన్ని వెబ్ సైట్లు 2, 2.5 రేటింగ్ కు మించి ఇవ్వలేదు. అయితే “మన” టీవీ అనే ఛానెల్ పవన్ ఫ్యాన్స్ ను డిస్కషన్స్ కు పిలించింది. సినిమా గురించి అన్ని విషయాలు చర్చించిన తర్వాత రేటింగ్ 3 పాయింట్లు ఇచ్చింది. అయితే ఆ రేటింగ్ చాలా తక్కువ అని భావించిన అభిమానులు….రెచ్చిపోయారు. మా హీరో సినిమాకు అంత తక్కువ రేటింగ్ ఇస్తారా అంటూ నానా హంగామా చేశారు. యాంకర్ పై చెయ్యి కూడా చేసుకున్నారు అని సమాచారం…మొత్తంగా ఈ అభిమానం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.