Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఆ ధైర్యం సొంతమా?
February 26, 2022 / 01:35 PM IST
|Follow Us
పవర్ స్టార్ పవన్ కళాణ్ అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ తర్వాత పలు సినిమాలతో విజయాలను అందుకున్నా ఆ సినిమాలు అత్తారింటికి దారేది స్థాయి హిట్లు కావు. రీఎంట్రీలో వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ సక్సెస్ సాధించినా ఈ సినిమా కూడా కరోనా సెకండ్ వేవ్ వల్ల రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలైంది. వకీల్ సాబ్ కోర్టు డ్రామా కావడంతో ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపలేదు.
అయితే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో ఆ బాకీని తీర్చేశారని చెప్పాలి. భీమ్లా నాయక్ యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు సెలబ్రిటీల ప్రశంసలను అందుకుంది. బాహుబలి2 తర్వాత రానాకు ఆ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాగా భీమ్లా నాయక్ నిలిచింది. సరైన పాత్ర పడితే రానా సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తారని భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది.
భీమ్లా నాయక్ రిలీజ్ కు ముందు ఈ సినిమా గురించి ఎన్నో నెగిటివ్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాలో రానా సీన్స్ ను కట్ చేశారని రానా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని కామెంట్లు వినిపించాయి. భీమ్లా నాయక్ లాంటి సీరియస్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో త్రివిక్రమ్ హ్యాండ్ ఉండటంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాగర్ కె చంద్రను నమ్మి పవన్, నిర్మాతలు రిస్క్ చేస్తున్నారేమో అనే కామెంట్లు వినిపించాయి.
అయితే భీమ్లా నాయక్ రిజల్ట్ తో ప్రేక్షకుల్లో నెలకొన్న అనుమానాలను పవన్ పటాపంచలు చేసేశారు. పవన్ నమ్మకం భీమ్లానాయక్ సినిమా విషయంలో నిజమైంది. కరోనా థర్డ్ వేవ్ తర్వాత ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా ధైర్యంగా సినిమాను విడుదల చేసి పవన్ కళ్యాణ్ సత్తా చాటారు. సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గదని భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది.