పవన్ కూడా గిఫ్ట్ ఇస్తాడట!

  • August 8, 2016 / 12:09 PM IST

ఈ మధ్య కాలంలో హీరోల పుట్టినరోజులు వస్తే చాలు.. వారి అభిమానులకు హీరోలు నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ నో.. లేక టీజర్ నో.. ట్రైలర్ నో.. రిలీజ్ చేసి గిఫ్ట్ ఇస్తున్నాం తీస్కోండని ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన సినిమా ప్రమోషనే. ఆల్రెడీ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్ పుట్టినరోజుల కోసం ఇలాంటి గిఫ్ట్స్ నే రెడీ చేసి ఉంచాడు.

ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా తన పుట్టినరోజు కానుకగా అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. పవన్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ కనిపించనుంది. రీసెంట్ గానే పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే సెప్టెంబర్2 ఆయన పుట్టినరోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి పవన్ ప్లాన్ చేస్తున్నాడు. పవన్ పుట్టినరోజు నాడు ఘనంగా వేడుకలను నిర్వహించాలని ఆయన అభిమానులు కూడా ప్లాన్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus