Pawan Kalyan: పవన్ గిప్ట్ గా ఇచ్చిన ఆ ప్యాంట్ ని ఆ హీరో తన సినిమాలో వేసుకున్నారా..!
September 1, 2023 / 08:51 PM IST
|Follow Us
ఆ రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమి చేసినా ట్రెండ్ సెట్టింగ్ లాగ ఉండేది, అలా అప్పట్లో ఆయన వేసిన ‘గుడుంబా శంకర్’ డబుల్ ప్యాంట్స్ ఎంతటి సంచలనం రేపిందో మన అందరికీ తెలిసిందే. ఇలాంటి దుస్తులు కూడా వేసుకుంటారా అని అందరూ ఆశ్చర్యపోయిన వేల అది. అప్పట్లో యూత్ మొత్తం అదే స్టైల్ ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇక ఆ తర్వాత వచ్చిన బాలు ప్యాంట్స్ కూడా ఇంతే, ఇది కూడా అప్పట్లో సెన్సేషన్.
ఇలాంటి క్రేజీ ఆలోచనలు (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ కి ఎలా వస్తాయి అని అనుకునేవారు అందరూ. ఈ ప్యాంట్స్ ధరలు లక్షల్లోనే ఉంటాయట. ఈ కాస్ట్యూమ్ డిజైన్ స్టైలింగ్ మొత్తం చేసింది రేణు దేశాయ్ అయితే, ఐడియా మాత్రం పవన్ కళ్యాణ్ దే. అయితే ఈ ప్యాంట్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో ఎవరికీ తెలియని ఒక ఆసక్తి విషయం బయటపడింది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ మరియు ‘బాలు’ కోసం వేసుకున్న ఆ ప్యాంట్స్ ని తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడట.
ఆయన తన మొదటి సినిమా ‘రేయ్’ లో ఈ ప్యాంట్స్ ని వాడడం మనం గమినించొచ్చు. ఆ సినిమా అతి పెద్ద డిజాస్టర్ అవ్వడం వల్ల ఈ చిన్న అంశాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ కి ఈ సెప్టెంబర్ 2 వ తారీఖున ఆయన పుట్టినరోజునాడు రీ రిలీజ్ అవ్వబోతుండడం తో ఈ విషయాన్నీ అభిమానులు చెప్పుకొచ్చారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ పలు ప్రాంతాలలో ప్రారంభించగా, మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది కానీ పవన్ కళ్యాణ్ గత సినిమా రీ రిలీజ్ లతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. మరి ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత గ్రాస్ ని రాబడుతుందో చూడాలి.