పదవి మీద కానీ పవర్ మీద కానీ ఎలాంటి కాంక్ష లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ముందు నుంచీ ఆయనకి ఉన్న ఏకైక కోరిక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు న్యాయం జరిగేలా చేయడం. అయితే.. తన మాట విని తన దగ్గరకి వస్తే గనుక ముఖ్యమంత్రిని చేస్తానంటున్నాడు కె.ఏ.పాల్. రాజశేఖర్ రెడ్డి హయాంలో విపరీతమైన ఆస్తులు సంపాదించడమే కాక ప్రపంచయాత్రలు చేసిన కె.ఏ.పాల్ అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ ను అందరూ కామెడీగా చూశారు కానీ.. అందులో సగానికిపైగా నిజాలున్నాయి.
అయితే.. ఈమధ్యకాలంలో కె.ఏ.పాల్ ఎక్కడా కనిపించలేదు. ఆయన ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. ఉన్నట్లుండి తెలంగాణాలో ఎన్నికల జరగనున్న తరుణంలో మీడియాలో పాల్ హల్ చల్ మొదలైంది. రీసెంట్ గా ఓ టీవి చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ “పవన్ కళ్యాణ్ చాలా మంచి అబ్బాయి తన దగ్గర ఆలోచన్ ఉంది కానీ.. డబ్బులు లేవు. అతను వచ్చి నాతో కలిస్తే అభివృద్ధికి డబ్బు ఇవ్వడమే కాక ముఖ్యమంత్రిని కూడా చేస్తాను” అని చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలారోజులుగా ఆన్ లైన్ లో నవ్వుకోవడానికి ఏమీ లేని జనాలు ఈ వీడియోను షేర్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు.