Pawan Kalyan: ‘వీరమల్లు’డి హూడీ లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా!

  • October 11, 2022 / 04:09 PM IST

‘జానీ’ సినిమా ఫలితం అభిమానుల్ని కంట తడి పెట్టించినా.. అందులో యాక్షన్‌ సీన్స్‌లో పవన్‌ కల్యణ్‌ ఇంటెన్స్‌ లుక్స్‌ మాత్రం ఇప్పటికీ ఎవర్‌ గ్రీనే. ‘ఖుషి’లో పవన్‌ కల్యాణ్‌ స్మైలింగ్‌ లుక్‌ ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకున్నాయో.. ‘జానీ’ ఇంటెన్స్‌ లుక్స్‌ కూడా అంతే బజ్‌ తెచ్చిపెట్టాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత పవన్‌ను ఆ లుక్‌లో చూసేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రాక్టీస్‌ సెషన్‌లో ఫొటో అది.

పైన ఫొటో మీరు కూడా చూశారు కదా.. పవన్‌ కల్యాణ్‌ లుక్‌ ఎంతగా అదిరిపోయిందో. ముందుగా చెప్పినట్లు ‘లెట్స్‌ గో జానీ..’ అంటూ ‘జానీ’ సినిమాలో పవన్‌ ఇలానే కనిపించాడు. ఈ లుక్‌ ఇలా టీమ్‌ బయటకు విడుదల చేసిందో లేదో.. అలా వైరల్‌ అయిపోయింది. ఇక సినిమా సంగతికొస్తే.. ఈ వారంలోనే ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణ కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుందని సమాచారం. సుదీర్ఘమైన షెడ్యూల్‌ కోసం చిత్రబృందం పక్కాగా సన్నద్ధమవుతోందట.

ఈ షెడ్యూల్‌ కోసం కొన్ని రోజులు క్రితం ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ కూడా నిర్వహించారు. అప్పుడు టీమ్‌ ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. ఇప్పుడు ఈ ప్రాక్టీస్‌ సెషన్‌ వీడియో కూడా ఏమన్నా రిలీజ్‌ చేస్తారేమో చూడాలి. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ కొత్త షెడ్యూల్‌లో కీలక పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా… మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమాలో బంధిపోటుగా కనిపిస్తాడు. నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నర్గీస్ ఫక్రీ, అర్జున్‌ రాంపాల్‌, నోరా ఫతేహీ ఇతర ముఖ్య పాత్రధారులు. ఎ.ఎం.రత్నం, ఎ.దయాకర్‌రావు నిర్మాతలు కాగా… కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus