Pawan Kalyan: నెట్ ఫ్లిక్స్ లో ‘బ్రో ది అవతార్’ కి ఎన్ని లక్షల వ్యూస్ వచ్చాయంటే!
October 3, 2023 / 05:48 PM IST
|Follow Us
భీమ్లా నాయక్’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్రో ది అవతార్’. తమిళం లో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఓటీటీ చిత్రం ‘వినోదయ్యా చిత్తం’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి ఆట నుండే ఏ రేంజ్ నెగటివ్ టాక్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ నుండి పాటలు , ఫైట్స్ లేకుండా సినిమా అంటే సాహసమే, పైగా ఈ చిత్రం లోని ఎమోషన్స్ కూడా ఆశించిన స్థాయిలో పండలేదు.
అందుకే నెగటివ్ టాక్ వచ్చింది, కానీ ఓపెనింగ్స్ మాత్రం (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ స్టామినా వల్ల వేరే లెవెల్ లో వచ్చాయి. క్లోసింగ్ లో 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి పర్వాలేదు అనిపించింది. ఇకపోతే ఈ చిత్రం ఈమధ్యనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడం ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే.
థియేట్రికల్ రెస్పాన్స్ కంటే నెట్ ఫ్లిక్స్ రెస్పాన్స్ ఈ సినిమాకి అదిరింది. సుమారుగా 21 రోజుల పాటు నాన్ స్టాప్ గా టాప్ లో ట్రెండ్ అయిన ఈ సినిమా, హిందీ వెర్షన్ కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తం మీద ఈ సినిమా ని ఫ్యామిలీ ఆడియన్స్ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత బాగా నచ్చినట్టుగా అర్థం అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి సుమారుగా 25 మిలియన్ వాచ్ హావర్స్ వచ్చాయట.
ఈమధ్య విడుదలైన చిత్రాలలో RRR తర్వాత అత్యధిక వ్యూస్ ని దక్కించుకున్న తెలుగు సినిమా ఇదే అని అంటున్నారు. దీని తర్వాతి స్థానం లో ఆదిపురుష్ నిల్చింది అట. ఇక త్వరలోనే ‘బ్రో ది అవతార్‘ చిత్రం జీ తెలుగు లో టెలికాస్ట్ అవ్వబోతుంది. ఓటీటీ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రానికి టీవీ టెలికాస్ట్ లో అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.