Ustaad Bhagat Singh: టైటిల్ బానే ఉంది.. ఆ ఎక్స్ట్రాలు.. ఎందుకు హరీష్!
December 11, 2022 / 09:02 AM IST
|Follow Us
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది భీమ్లా నాయక్ తో అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్ … మరో మూడు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి సముద్ర ఖని దర్శకత్వంలో చేయాల్సిన వినోదయ సీతం రీమేక్ కాగా .. ఇంకోటి సుజీత్ దర్శకత్వంలో, అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మరోపక్క క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీర మల్లు సినిమా షూటింగ్లో కూడా బిజీగా గడుపుతున్నాడు.
ఇదిలా ఉండగా.. హరీష్ శంకర్ తో మూవీ అనౌన్స్ చేసి 3 ఏళ్ళు కావస్తోంది. అయినా ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలైంది లేదు. హరీష్ వేరే సినిమాకి షిఫ్ట్ అయిపోదాం అనుకున్న టైంలో పవన్ తో డిస్కస్ చేసి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు నిర్మాతలైన మైత్రి వారు. అయితే మొదట భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ టైటిల్ మారినట్టు .. అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఉస్తాద్ భగత్ సింగ్. చిత్ర బృందం స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసి ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు అని టైటిల్ మార్చడం బట్టి అర్థం చేసుకోవచ్చు.
అంతే కాదు క్యాప్షన్ గా మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పవన్ వైసిపి పార్టీకి వార్నింగ్ ఇచ్చిన డైలాగ్ ను కూడా పెట్టారు. ఈ క్యాప్షన్ తో ఫ్యాన్స్ హాపీ అవ్వొచ్చు.. కానీ మళ్ళీ వైకాపా ప్రభుత్వం పవన్ సినిమాకి అవాంతరాలు తెచ్చే పనులు పూనుకునే అవకాశం అయితే లేకపోలేదు.