మనల్ని, మన కుటుంబాన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వస్తే… అలాంటి ఆలోచన చేస్తే మన శాయశక్తులా కృషి చేస్తాం. లేదా ఎవరైనా మన తరఫున పోరాడితే, పోరాడుతుంటే, పోరాడాలని అనుకుంటే సాయం చేస్తాం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఇలాంటి పరిస్థితిలోనే ఉంది అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. దీని కోసం ఎవరైనా ఒకరు గొంతెత్తితే బాగుండు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. అలాంటి సమయంలో ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కల్యాణ్ గళమెత్తాడు. అయితే అతనికి ఇండస్ట్రీ నుండి సపోర్టు లేకపోవడం గమనార్హం.
సినిమా పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది అందరికీ అంటుంటారు మన హీరోలు, దర్శకులు, నిర్మాతలు. కానీ కష్టాలొచ్చినప్పుడు మాత్రం ‘నా సినిమాకు కాదులే’ అనుకుని వదిలేస్తుంటారు. ఈ మాట మేం అన్నది కాదు… నిన్న పవన్ ఆ మాటలు అన్నాక… పరిశ్రమ నుండి ఇప్పటివరకు వస్తున్న స్పందన చూసి నెటిజన్లు అంటున్న మాట ఇది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పవన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దానికి ఇప్పటివరకు వస్తున్న స్పందన చూస్తే ఈ విషయం మీకూ తెలిసిపోతుంది. యువ నటులు నాని, కార్తికేయ మాత్రమే ఇప్పటివరకు పవన్‌ను సమర్థిస్తూ స్పందించారు.
మిగిలిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంటూ ఆదివారం సెలవు దినం అన్నట్లుగా సెలవు తీసుకొని గమ్మునున్నారు. ఓవైపు పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మూకుమ్మడి దాడి చేస్తుంటే, సినిమా జనాలు మాత్రం ‘అది పవన్ సొంత విషయం’ అన్నట్లుగా మారిపోయారు. పుండు మీద కారం చల్లినట్లు ‘ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మాకు చాలా నచ్చాయి. పరిశ్రమ అభివృద్ధికి చాలా దోహదం చేస్తున్నారు మన సీఎంలు’ అంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ‘ఏపీ ప్రభుత్వంతో మాకెందుకులే’ అని అనుకుని వదిలేశారని అర్థమవుతోంది.
పవన్ కల్యాణ్ మాటలు.. సినిమా హీరోగా కాకుండా, పొలిటికల్ లీడర్‌లా ఉన్నాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఆలోచన ఎలా అయినా ఉండొచ్చు… కానీ సినిమా పరిశ్రమ మంచి కోసం ఆయన ఈ పని చేశారు అని అర్థమవుతోంది కదా. ఒకవేళ ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో చిత్ర పరిశ్రమకు ఏమీ ఇబ్బంది లేదు అని అనుకుంటే ఈ విషయం పవన్‌కు ఇప్పటివరకు చేరలేదా? అంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా? హీరోలు, నిర్మాతల మధ్య అనేది కూడా ఆలోచించాలి. ఏపీలో టికెట్ ధరల సమస్య… సమస్యలా కనిపించడం లేదా అంటే ఇదే నిర్మాతలు మొన్నటివరకు ఈ విషయాన్ని చెప్పే… సినిమా విడుదలల ఆపేశారు కదా. అప్పుడు సమస్య… ఇప్పుడు కాకుండా పోయిందా?
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!