Pawan Kalyan: అలీను రికమెండ్ చేసిన పవన్!

  • April 23, 2021 / 05:37 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఆయన సినిమాల్లో అలీ కచ్చితంగా కనిపిస్తారు. ‘తొలిప్రేమ’ నుండి మొదలుపెడితే.. ‘కాటమరాయుడు’ సినిమా వరకు వీళ్ల కాంబినేషన్ వెండితెరపై బాగా వర్కవుట్ అయింది. ‘ఖుషీ’ లాంటి సినిమాలో వీరిద్దరూ కలిసి పండించిన కామెడీకి ఇప్పటికీ ప్రేక్షకులు నవ్వుకుంటారు. గతంలో ఓసారి పవన్ కళ్యాణ్ స్వయంగా.. అలీ లేకపోతే నేను సినిమా చేయలేను అని చెప్పారంటే.. వీరిద్దరి మధ్య బంధం స్ట్రాంగ్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే కొన్నాళ్లక్రితం రాజకీయాల పరంగా వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. మీడియా ముఖ్యంగా ఇద్దరూ చెరో మాటా అనుకున్నారు. దీంతో వీరి బంధానికి బ్రేక్ పడినట్లైంది. కానీ ఇప్పుడిప్పుడే అవన్నీ మెల్లగా తేలిపోతున్నాయి. ఈ మధ్య పవన్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు అలీ. రాజకీయంగా విబేధాలు ఉన్నా.. తమ మధ్య బంధం మాత్రమే అలానే ఉందని చెబుతున్నాడు అలీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో అలీకి ఓ పాత్ర దక్కిందని సమాచారం.

పవన్ రీఎంట్రీలో వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటిస్తోన్న ఓ సినిమాలో అలీకి మంచి పాత్రలో నటించే ఛాన్స్ వచ్చిందట. ఆ పాత్ర అలీ చేస్తేనే బాగుంటుందని.. పవన్ దర్శకుడికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో అలీని ఫైనల్ చేసినట్లు సమాచారం. సో.. మరోసారి పవన్-అలీ కాంబినేషన్ ను వెండితెరపై చూడొచ్చన్నమాట!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus