Pawan Kalyan: బ్రో సినిమా రన్ టైమ్ విషయంలో మేకర్స్ రిస్క్ చేస్తున్నారా?

  • July 14, 2023 / 01:11 PM IST

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ రిలీజ్ కు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. బ్రో మూవీ నిడివి 2 గంటల 10 నిమిషాలు మాత్రమేనని సమాచారం అందుతోంది. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి అధికారికంగా మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ బ్రో మూవీ నిడివి అంత తక్కువా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బ్రో సినిమా రన్ టైమ్ విషయంలో మేకర్స్ రిస్క్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. బ్రో మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ ఇద్దరు హీరోయిన్లపై ఐరన్ లెగ్ అనే ముద్ర ఉంది. అయితే బ్రో సినిమా ఈ ఇద్దరు హీరోయిన్లకు కూడా సక్సెస్ ను అందించే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బ్రో సినిమా ఏపీ హక్కుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రో సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. సముద్రఖని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా సముద్రఖని ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం స్టార్ స్టేటస్ ను సైతం సొంతం చేసుకుంటానని నమ్ముతున్నారు. పవన్ సైతం బ్రో మూవీ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

బ్రో సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసి ఉంటే ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రో సినిమాలో కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు అవసరమైన అన్ని అంశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus