పవన్, తేజ్ నటించిన చిత్రానికి ఆ టైటిలే ఫిక్స్ చేస్తారా..?

  • May 2, 2023 / 09:13 AM IST

పవన్‌ కల్యాణ్‌- సాయిధరమ్‌ తేజ్‌ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! తమిళ హిట్‌ చిత్రం ‘వినోదాయ శీతం’చిత్రానికి రీమేక్‌ ఇది. సముద్రఖని దర్శకుడు. ఇప్పటికే టాకీ పార్ట్‌ పూర్తయింది. ఇటీవల హైదరాబాద్‌లో పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. వచ్చేవారంలో ఓ పాటను చిత్రీకరిస్తారు. ఫాంటసీ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ నిర్ణయించలేదు. ఇప్పుడు సోషల్‌ మీడియా మొత్తం ఇదే చర్చ. అయితే ఈ సినిమాకు కొన్ని టైటిళ్లు అనుకుంటునట్లు పేర్లు బయటికొచ్చాయి.

అందులో ‘దేవర’ ఒకటి. ఈ చిత్రానికి ఇదే టైటిల్‌ ఫిక్స్‌ చేస్తారని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. తాజాగా మరో టైటిల్‌ బయటకొచ్చింది. అదే… ‘దేవుడే దిగి వచ్చినా’. దేవుడికీ, మనిషికీ మధ్య నడిచే కథ ఇది. కథలో కీలక సన్నివేశాలన్నీ వారి ఇద్దరి మఽధ్యే నడుస్తాయట. అందుకే దేవుడిని స్పురించేలా ఓ టైటిల్‌ పెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే ‘దేవుడే దిగీ వచ్చినా’ అనే పేరు ఖరారు చేశారని సమాచారం.

ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారని టాక్‌! ఈ టైటిల్‌ కూడా ఆయనే సూచించారని తెలుస్తోంది. ఈ వారంలో టైటిల్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల ఈ టైటిల్‌ గురించి జబర్దస్త్‌ కమెడియన్‌, పవన్‌కల్యాణ్‌ అభిమాని అయిన హైపర్‌ ఆది ‘దేవుడే దిగి వచ్చినా’? అంటూ పవన్‌కల్యాణ్‌, పికెఎస్‌డిటి టైటిల్‌ను ట్యాగ్‌ చేశారు. అప్పటి నుంచే ఈ టైటిల్‌ గురించి చర్చ మొదలైంది.

అభిమానులు అయితే పవన్‌కు ఈ టైటిల్‌ కరెక్ట్‌గా సూటవుతుందని ఇదే టైటిల్‌ ఖాయం చేయమని సూచించారు. మరి ఏ టైటిల్‌ ఫైనల్‌ చేస్తారో చూడాలి. జూలై 28న ఈ చిత్రం విడుదల కానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus