పరిశ్రమలో దర్శకుడు సురేంధర్ రెడ్డి, రచయిత వక్కంత వంశీకి మధ్య మంచి అనుబంధం ఉండేది. సురేంధర్ రెడ్డి కేరీర్ బిగినింగ్ నుండి వక్కంతం వంశీతో కలిసి పనిచేశారు. సురేంధర్ రెడ్డి తెరకెక్కించిన అనేక చిత్రాలకు వంశీ కథను అందించడం జరిగింది. 2006లో వచ్చిన అశోక్ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం కిక్ 2 వరకు సాగింది. అందులో కిక్, రేసు గుర్రం వంటి హిట్ చిత్రాలకు కలిసి పనిచేశారు. ఐతే కిక్ 2 ఘోరపరాజయం తరువాత వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్లు టాక్ వినిపించింది.
నాపేరు సూర్య సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ఆ మూవీ పరాజయం చెందడంతో దర్శకుడిగా అవకాశాలు దక్కించుకోలేకపోయారు. కిక్ 2 వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతుండగా మళ్ళీ పవన్ కోసం వీరిద్దరూ కలిశారు. పవన్ కళ్యాణ్ తన 29వ చిత్రం దర్శకుడు సురేంధర్ రెడ్డితో ప్రకటించగా ఆ మూవీకి కథను వక్కంతం వంశీ అందిస్తున్నారు. దీనితో చాల కాలం తరువాత మిత్రులు పవన్ కోసం కలిసినట్లు అయ్యింది.
పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ సబ్జెక్టు ని సిద్ధం చేశారట. పవన్ కి కూడా కథ బాగా నచ్చినట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవగా వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 సమ్మర్ కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది.
Most Recommended Video
తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!