Pawan Kalyan: హరిహర వీరమల్లు సినిమాకు ఆ సాంగ్ ప్లస్ కానుందా?

  • April 24, 2023 / 05:23 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. సుధీర్ఘ కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు మూవీ పాన్ ఇండియా హిట్ గా నిలవడంతో పవన్ రేంజ్, క్రేజ్, పాపులారిటీని రెట్టింపు చేస్తుందని భావిస్తున్నారు. దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాట పాడుతున్నారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పాట సినిమాకు హైలెట్ కానుంది. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ గతంలో కూడా కొన్ని సినిమాలలో పాటలు పాడగా ఆ పాటలకు ప్రశంసలు దక్కాయి. పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ పాట పాడుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తుండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో కూడా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పారితోషికం ప్రస్తుతం 70 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. హరిహర వీరమల్లు మూవీ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతోంది.

పవన్ కళ్యాణ్ పాడుతున్న పాట టైటిల్ ట్రాక్ గా ఉండనుందని బోగట్టా. కీరవాణి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పాట పాడుతున్నారని తెలుస్తోంది. త్వరలో హరిహర వీరమల్లు మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుందని బోగట్టా. నిధి అగర్వాల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాపై ఎంతోమంది కెరీర్ ఆధారపడిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus