Vakeel Saab Movie: దిల్ రాజు తెలివితేటలు మామూలుగా లేవుగా..?
May 6, 2021 / 08:28 PM IST
|Follow Us
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ థియేటర్లలో రిలీజై కరోనా వల్ల కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు సాలిడ్ కం బ్యాక్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజైన 56 రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉన్నా కరోనా వల్ల థియేట్రికల్ రన్ ముగియడంతో 21 రోజులకే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఓటీటీలో ఈ సినిమా రికార్డు స్థాయిలో వ్యూస్ ను సాధిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఈ సినిమా ఇండియాలో అందుబాటులో వచ్చినా ఓవర్సీస్ లో మాత్రం అందుబాటులోకి రాలేదు. అయితే ఓవర్సీస్ ఆడియన్స్ కు ఆహా యాప్ శుభవార్త చెప్పింది. ఆహా యాప్ ఓవర్సీస్ ఆడియన్స్ కోసం ఎక్స్ క్లూజివ్ వెర్షన్ ను అందుబాటులోకి వచ్చింది. కరోనా వల్ల ఓవర్సీస్ లో వకీల్ సాబ్ నిర్మాతలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు. ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఫ్లాప్ గా నిలిచింది.
మరి వకీల్ సాబ్ ఆహా ఓటీటీలోహిట్టవుతుందో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ కొనుగోలు చేయగా టీవీలో ఈ సినిమా ఎప్పుడు ప్రసారమవుతుందో చూడాల్సి ఉంది. ఆహా ఈ సినిమా డిజిటల్ హక్కులను ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందో తెలియాల్సి ఉంది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ఇండియా హక్కులను అమెజాన్ ప్రైమ్ కు, ఓవర్సీస్ హక్కులను ఆహాకు అమ్మి డిజిటల్ హక్కుల ద్వారా భారీ మొత్తం సంపాదించినట్లు తెలుస్తోంది.