వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్.. సాలీడ్ ఆఫర్

  • January 15, 2021 / 01:44 PM IST

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ మూవీ అనంతరం రాబోతున్న సినిమా కాబట్టి అభిమానులు ఈ సినిమాతో భారీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. బాలీవుడ్ పింక్ సినిమాకి రీమేక్ గా రాబోతున్న విషయం తెలిసిందే.

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకోవడానికి కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ భారీగా ఆఫర్స్ ఇస్తున్నాయట. మొదట్లో టీజర్ ను జెమిని టీవీ వాళ్ళు దక్కించుకున్నట్లు ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా జీ తెలుగు శాటిలైట్ హక్కులను అందుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇక ధర రూ.15కోట్ల వరకు వెళ్లినట్లు సమాచారం.

దాదాపు జీ తెలుగు ఛానెల్ కు రైట్స్ దక్కినట్లు టాక్ వస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ గురువారం సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఇక నిమిషాల్లోనే టీజర్ భారీ స్థాయిలో వ్యూవ్స్ ను అందుకుంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus