రెండో పెళ్లి చేసుకొన్న రేణుని అభినందించిన పవన్ కళ్యాణ్
June 26, 2018 / 05:52 AM IST
|Follow Us
ఇటీవల సరికొత్త బంధం మొదలైంది అంటూ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, అకీరా నందన్ తల్లి రేణుదేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేసినప్పట్నుంచి కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు జనరల్ పబ్లిక్ ఆమెను అదే పనిగా ట్రోల్ చేయగా.. చాలా తక్కువమంది మాత్రమే ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే.. ఇవాళ ఒక్క ట్వీట్ తో రేణు మీద నిప్పులు చెరుగుతున్న కొందరు సెన్స్ లెస్ ఫ్యాన్స్ నోళ్ళు మూయించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన ట్విట్టర్ లో ఉదయం “కొత్త జీవితం ప్రారంభించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు రేణు గారు, మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంతో, సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని ఆ దేవుడ్ని కోరుకొంటున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ అందరి హృదయాల్ని కదిలించింది.
తాను మూడో పెళ్లి చేసుకొన్నప్పుడు తన నిర్ణయాన్ని అంగీకరించిన రేణు దేశాయ్.. ఇన్నాళ్లపాటు ఒంటరిగా ఇద్దరు పిల్లలతో జీవితాన్ని నెట్టుకొచ్చిన రేణు దేశాయ్ 35 ఏళ్ల వయసులో మరి వ్యక్తిని ఇష్టపడి మన భారతీయ సంస్కృతిని గౌరవించి సహజీవనం కాకుండా పెళ్లి చేసుకోవడాన్ని పవన్ కళ్యాణ్ కూడా స్వాగతించడం అనేది ఆయన తన మాజీ భార్య మీద ఉంచిన గౌరవాన్ని ప్రతిబింబించింది. స్వయంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు కాబట్టి ఇప్పటికైనా రేణు తీసుకొన్న నిర్ణయాన్ని అందరూ గౌరవించి ఆమె పర్సనల్ లైఫ్ ని ఆమెకు వదిలేసి ఆమెను ప్రశాంతంగా ఉండనిస్తారని ఆశిస్తూ.. ఆమెకు మరోమారు శుభాకాంక్షలు.