వీరాభిమానులు ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. మిగతా హీరోల ఫ్యాన్స్ తో పోల్చుకుంటే వీరి అభిమానం ఓ మెట్టు పైనే ఉంటుంది. అందుకే మిగతా స్టార్ హీరోల రికార్డ్స్ బ్రేక్ చేయాలని కోరుకుంటారు. పెద్ద పెద్ద రికార్డ్స్ మొత్తం తమ హీరో పేరుమీదే ఉండాలని వారు ఆశపతారు. బాక్సాఫీస్ రికార్డ్స్ పూర్తిగా హీరో స్టార్ డమ్ మరియు సినిమాలపై ఆధారపడి ఉంటాయి. కొత్త ట్రెండ్ అయిన సోషల్ మీడియా రికార్డ్స్ పై పూర్తిగా ఆధిపత్యం ఫ్యాన్స్ దే. ఈ విషయంలో మాకు సాటి లేరనిపించుకున్న పవన్ ఫ్యాన్స్ ఇటీవల వరల్డ్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
పవన్ బర్త్ డే సీడీపీ యాష్ ట్యాగ్ తో పవన్ ఫ్యాన్స్ కొత్త రికార్డు నెలకొల్పారు. మహేష్ ఫ్యాన్స్ 62.1 మిలియన్స్ రికార్డుని 65.1 మిలియన్ ట్వీట్స్ తో పవన్ ఫ్యాన్స్ బ్రేక్ చేయడం జరిగింది. మహేష్ రికార్డు బ్రేక్ చేసినందుకు పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఐతే పవన్ ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవిని పెద్దగా పట్టించుకోవడం లేదనిపిస్తుంది. మరో మూడు రోజులలో చిరంజీవి పుట్టినరోజు ఉన్నప్పటికి పెద్దగా సందడి లేదు. కేవలం చిరంజీవి, చరణ్ అభిమానులు మాత్రమే ఆయన పుట్టినరోజు గురించి సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు.
పవన్ ఫ్యాన్స్ ఈ వేడుకపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చిరంజీవి 65వ పుట్టిన రోజు చాలా ప్రత్యేకం అయినప్పటికీ, పవన్ ఫ్యాన్స్ ఇన్వాల్వ్ కావడం లేదు. కేవలం పవన్ బర్త్ డే సీడీపీని ఓ రేంజ్ లో పని గట్టుకొని, పనులు మానుకొని ట్రెండ్ చేసిన ఫ్యాన్స్… చిరంజీవి బర్త్ డే యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసేలా కనిపించడం లేదు. దీనితో చిరు బర్త్ డే ట్యాగ్ పవన్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డు దరిదాపుల్లోకి కూడా వెళ్లకపోవచ్చు . మరి అది ఒకరంగా చిరంజీవి చిన్నబుచ్చుకొనే అంశమే అని చెప్పాలి.