Bro Movie: ఐఎండీబీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన బ్రో.. అసలేమైందంటే?

  • August 2, 2023 / 07:39 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా సోషల్ మీడియాలో సైతం పవన్ కళ్యాణ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితంచబడుతుండటం గమనార్హం. ఈ వీకెండ్ సమయానికి కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే బ్రో మూవీ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.

వినోదాయ సిత్తం ఐఎండీబీ రేటింగ్ 8 కాగా 8.4 గా ఉంది. ఒక విధంగా ఇది అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. సినిమా ఎంతో అద్భుతంగా ఉంటే మాత్రమే ఐఎండీబీ నుంచి ఈ స్థాయిలో రేటింగ్ వస్తుంది. బ్రో మూవీలో మంచి మెసేజ్ ఉండటం వల్లే ఈ సినిమాకు అరుదైన ఘనత సొంతమైందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. బ్రో సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతగానో నచ్చుతోంది.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారని సమాచారం అందుతోంది. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సినిమాల షూటింగ్ లను వేగంగా పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల ఫలితాల తో సంబంధం లేకుండా క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

బ్రో సినిమా (Bro Movie) రిలీజ్ కు ముందే నిర్మాతలకు 50 కోట్ల రూపాయల లాభాలను అందించడం గమనార్హం. బ్రో సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడంతో పాటు మంచి లాభాలను అందించడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus