Payal Rajput: వైరల్ అవుతున్న మంగళవారం సినిమా పోస్టర్.. !

  • April 25, 2023 / 01:21 PM IST

‘ఆర్.ఎక్స్.100’ చిత్రం దర్శకుడు అజయ్ భూపతికి.. అటు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు స్టార్ డంని తెచ్చిపెట్టింది. అటు తర్వాత వీళ్ళకి బోలెడన్ని అవకాశాలు వస్తాయి అనుకుంటే అలా జరగలేదు. హీరోయిన్ పాయల్ పెద్ద సినిమాల్లో నటించింది కానీ అవి ఆమెకు కలిసిరాలేదు. ఇక అజయ్ భూపతి మహా సముద్రం అంటూ శర్వానంద్ , సిద్దార్థ్ లను పెట్టి ఓ భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేశాడు.అనిల్ సుంకర వంటి మంచి నిర్మాత దొరికాడు.

కానీ సినిమా మాత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. తన మొదటి సినిమాకి మించి అంటే 15 రెట్లు బడ్జెట్ పెట్టించి ఆ సినిమా చేశాడు. అది కాస్త పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో అజయ్ భూపతితో సినిమా చేయడానికి హీరోలు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మళ్లీ పాయల్ గ్లామర్ నే నమ్ముకుని ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ తీశాడు.అదే మంగళవారం. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ‘మంగళవారం’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.

ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ను మొన్నామధ్య రిలీజ్ చేసిన దర్శకుడు అజయ్… నటీనటుల వివరాలను ఒక్కో పోస్టర్ ద్వారా రివీల్ చేస్తానని తెలిపాడు. తాను చెప్పినట్టుగానే ఈరోజు ఈ చిత్రంలో మెయిన్ రోల్ పోషిస్తున్న పాయాల్ రాజ్ పుత్ లుక్ ను లాంచ్ చేశాడు. ఈ లుక్ లో పాయల్ నూలుపోగు లేకుండా చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. కొద్దిసేపటికే ఈ పోస్టర్ వైరల్ అయిపోయింది. శైలజ అనే పాత్రలో ఈమె (Payal Rajput) కనిపించబోతుంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus