బెల్లంకొండ బాబును వెయిటింగ్ లో ఉంచిన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ!

  • September 18, 2018 / 06:59 AM IST

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన “ఆర్ ఎక్స్ 100” ఫేమ్ పాయల్ రాజ్ పుట్ కి అనుకున్నదానికంటే ఎక్కువ అవకాశాలొచ్చాయి. మీడియం బడ్జెట్ సినిమాల ఆఫర్లు క్యూ కట్టగా.. పెద్ద సినిమాల నుంచి కూడా మంచి ఎంక్వైరీస్ వచ్చాయి. రామ్ చరణ్ సినిమా ఆఫర్ వచ్చినప్పటికీ అమ్మడు స్పెషల్ సాంగ్ చేయడం ఇష్టం లేక కాదనుకుంది. అలాగే.. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ వస్తే వద్దనేసింది. దాంతో తేజ ఆమెకు మరోసారి పిలిచి మరీ స్పెషల్ సాంగ్ ఆఫర్ ఇచ్చాడు. బెల్లంకొండ బాబు అయితే ఎప్పట్లానే ఎంత అడిగినా ఇవ్వడానికి రెడీ అన్నప్పటికీ.. పాయల్ మాత్రం ఇంకా ఆలోచనలో ఉన్నాను అంటూ ఇప్పటికీ రిప్లై ఇవ్వలేదంట.

అయితే.. తాజా సమాచారం ప్రకారం పాయల్ కి తెలుగులో మాత్రమే కాక తమిళంలోనూ భారీ ఆఫర్లు వస్తున్నాయట. ఆర్.ఎక్స్ 100 తమిళ రీమేక్ లోనూ పాయల్ ను కథానాయికగా తీసుకోవాలనుకొంటున్నారట. ఆ పాత్రను ఆమెకంటే బాగా పెర్ఫార్మ్ చేసే నటి దొరక్కపోవడంతోపాటు.. ఆల్రెడీ రిజిష్టర్ అయిన పాయల్ అయితేనే ఆ పాత్ర పండుతుందని తమిళ దర్శకనిర్మాతలు భావించడంతో.. ఆమెను అప్రోచ్ అయ్యారట. మరి ఆల్రెడీ ఒకసారి ప్లే చేసిన రోల్ ను పాయల్ మళ్ళీ ప్లే చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus