విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ కొత్త ట్రెండ్ ను సృష్టిస్తుంది..!
November 12, 2020 / 09:12 PM IST
|Follow Us
‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. మొదటి చిత్రంతోనే బీభత్సమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాలో ఈమె చేసిన గ్లామర్ షోకి.. అలాగే అద్భుతమైన నటనకు అంతా ఫిదా అయిపోయారు. కోరిక తీర్చుకోవడం కోసం ప్రేమను అడ్డం పెట్టుకుని.. అమాయకుడైన ఓ యువకుడిని మోసం చేసి చంపించేసే పాత్రలో పాయల్ ఆ చిత్రంలో కనిపిస్తుంది. ఆ చిత్రం తరువాత పాయల్ కు మంచి ఆఫర్లే వస్తున్నాయి.
ఇప్పటికే ‘వెంకీ మామ’ ‘డిస్కో రాజా’ వంటి బడా ప్రాజెక్టుల్లో నటించింది. ప్రస్తుతం ‘అనగనగా ఓ అతిథి’ అనే చిత్రంలో నటిస్తుంది ఈ బ్యూటీ. త్వరలోనే ‘ఆహా’ ఓటిటిలో ఇది విడుదల కానుంది. ఇదిలా ఉండగా… సాధారణంగా హీరో, హీరోయిన్లు మద్యం బ్రాండ్ లను ప్రమోట్ చెయ్యడానికి ఇష్టపడరు. వారి ఇమేజ్ ను అది దెబ్బ తీస్తుందేమో అనే ఉద్దేశంతో వారు అలాంటి సాహసం చెయ్యరు. కానీ మన పాయల్ రాజ్ పుత్ మాత్రం ఓ విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది.
దానికి సంబంధించిన ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.దాంతో పాటు ‘తెలంగాణలో లభించే సరికొత్త సున్నితమైన ఖరీదైన విస్కీ’ అంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు పాయల్ ను ట్రోల్ చేస్తుంటే..’మరికొంత మంది ఆమె చేస్తున్న దాంట్లో తప్పేముంది.. ఆమె వ్యతిరేకించినంత మాత్రాన మద్యం సేవించే వాళ్ళు మానేస్తారా మద్యం షాపులు మూసేస్తారా? ఆమె ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంది అంతే కదా’ అంటూ వెనకేసుకొస్తున్నారు.