Payal Rajput: పాయల్ ని అన్నీ వదిలేసి వచ్చేయమన్న తల్లి!
December 6, 2021 / 11:14 AM IST
|Follow Us
ఇటీవల పాయల్ రాజ్ పుత్ ఎల్లో కలర్ సూట్ ఒకటి ధరించి ఫోటోషూట్ లో పాల్గొంది. బ్లేజర్ తప్ప మరేమీ వేసుకోకుండా.. బోల్డ్ షో చేసింది పాయల్. ఎక్స్ పోజింగ్ మరీ ఎక్కువ అవ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ట్విట్టర్, వాట్సాప్ లలో ఆమె వీడియో బాగా వైరల్ అయింది. దీంతో పాయల్ ఆవేదన చెందింది. తను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన రీల్స్ వీడియోలో నిప్ స్లిప్ లేదని..
ఎవరో కావాలనే తన వీడియో లీక్ చేశారని ఆమె పేర్కొంది. నెటిజన్ల కామెంట్స్ చూసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడానికి భయపడ్డానని.. ఆ కామెంట్స్ తనపై బాగా ప్రభావం చూపించాయని పాయల్ చెప్పుకొచ్చింది. అది కేవలం నిప్ స్లిప్ మాత్రమేనని.. దాన్ని జనాలు ఎందుకు పెద్ద ఇష్యూ చేస్తున్నారో అర్ధం కావడం లేదని చెప్పింది. అమ్మాయిల ప్రయివేట్ పార్ట్స్ ఎప్పుడూ చూడనట్లు ప్రవర్తిస్తున్నానని తెలిపింది. సోషల్ మీడియాలో కామెంట్స్ చూసిన తరువాత
ఇతర మహిళలు లేనిది ఏమైనా తనకు ఉందా అని ఆశ్చర్యపోయానని పాయల్ చెప్పుకొచ్చింది. తన ఫ్యామిలీపై కూడా ఈ కామెంట్స్ ప్రభావం చూపాయని.. అన్నీ వదిలేసి ఇంటికి వచ్చేయమని తన తల్లి చెప్పిందని.. కానీ ఇలాంటి ట్రోల్స్ ను ఎదుర్కొనే శక్తి తనకు ఉందని చెప్పినట్లు పాయల్ తెలిపింది.