ఆత్మహత్య చేసుకుంటాను అన్న అభిమానికి షాకిచ్చిన పాయల్..!
June 23, 2020 / 11:48 AM IST
|Follow Us
ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం.. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ను కూడా విషాదంలోకి నెట్టేసింది. సెలబ్రిటీల నుండీ సామాన్యుల వరకూ సుశాంత్ ఆత్మహత్య పై విషాదం వ్యక్తం చేసారు. ఈ లిస్టు లో ‘ఆర్.ఎక్స్.100′ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కూడా ఉంది.’సుశాంత్ ఆత్మహత్య పట్ల నేను కూడా.. తీవ్ర ఆవేదనకు’ గురయ్యాను’ అని పాయల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అటు తరువాత ఓ మూడు రోజుల వరకూ పాయల్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది.అయితే తరువాత అభిమానులతో ముచ్ఛటించడానికి మళ్ళీ సోషల్ మీడియాకి వచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని చేసిన కామెంట్ కు పాయల్ ఫైర్ అయ్యింది. విషయం ఏమిటంటే… పాయల్ చాటింగ్ బాక్స్ లో ఓ అభిమాని ‘నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది, నేను చచ్చిపోతాను’ అంటూ రాసుకొచ్చాడు. ఈ కామెంట్ ను చూసిన పాయల్ కు ఎక్కడ లేని కోపం వచ్చింది.
‘ఆత్మహత్య చేసుకోవాలి అని నీకు అనిపిస్తే… వెళ్ళి చచ్చిపో.కానీ ఆత్మహత్య ఏ ప్రాబ్లమ్ కు సొల్యూషన్ కాదు అని గుర్తుపెట్టుకో’ అంటూ మండిపడింది పాయల్..!