Payal Rajput: పెళ్లికి ముందే ప్రియుడితో ఓపెన్ గా..!
May 3, 2021 / 02:34 PM IST
|Follow Us
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ లు చాలా కామన్. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎఫైర్స్ చాలానే చూస్తున్నాం. అయితే చాలా మంచి సెలబ్రిటీలు తమ డేటింగ్ విషయాలను సీక్రెట్ గా ఉంచుతారు. పర్సనల్ లైఫ్ గురించి బయట ఎక్కడా మాట్లాడరు. మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నించినా.. తప్పించుకుంటారు. కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. తన ప్రియుడితో గడుపుతున్న క్షణాల గురించి అందరితో షేర్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన హాట్ ఫోటోలతో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తుంటుంది.
తన వ్యక్తిగత విషయాలను సైతం ఎప్పటికప్పుడు అందరితో షేర్ చేసుకుంటుంది. గత తన బాయ్ ఫ్రెండ్ ను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసిన పాయల్.. అప్పటినుండి తన ప్రియుడు సౌరభ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ తన సినిమా షూటింగ్ లకు కూడా లవర్ ను వెంటబెట్టుకొని వెళ్తోంది.
ఈ క్రమంలో ఇటీవల అతడితో కలిసి బెడ్ మీదున్న వీడియోను షేర్ చేసి షాకిచ్చిన ఈ బ్యూటీ తాజాగా మరో ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం పాయల్ ఓ పంజాబ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రియుడితో కలిసి పంజాబ్ కు వెళ్లిందట. అక్కడ ఇద్దరూ కలిసి ఒకే హోటల్ రూమ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాయల్ నేరుగా చెబుతూ.. ప్రియుడితో తీసుకున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో తన బాయ్ ఫ్రెండ్ పై వాలిపోయి మరీ ఫోటోకి ఫోజిచ్చింది పాయల్.