Payal Rajput: లిక్కర్ బ్రాండ్ ప్రమోషన్ ట్రోలింగ్ పై పాయల్ రియాక్షన్!
April 16, 2022 / 04:13 PM IST
|Follow Us
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమెకి ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ స్క్రిప్ట్ లను ఎన్నుకోవడంలో పొరపాట్లు చేయడంతో చాలా త్వరగా ఫేడవుట్ అయిపోయింది ఈ బ్యూటీ. దీంతో ఇప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు మద్యం బ్రాండ్స్ ను, కండోమ్ యాడ్స్ ను ప్రమోట్ చేస్తూ కనిపించారు. హీరోయిన్లు ఇలా చేసే ప్రతీసారి దారుణంగా ట్రోలింగ్ కి గురవుతుంటారు. గతంలో కాజల్, సమంత, రెజీనా ఇలా చాలా మంది లిక్కర్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేశారు. దీంతో వారిని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. హీరోలు ఇలాంటి యాడ్స్ లో నటిస్తే సైలెంట్ గా ఉండే జనాలు.. హీరోయిన్ల విషయంలో ఇలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.
గతంలో పాయల్ రాజ్ పుత్ ఓ విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ఆ తరువాత డిలీట్ చేసినా.. అప్పట్లో ట్రోల్స్ బాగా పడ్డాయి. ఈ విషయంపై తాజాగా పాయల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆమోదించిన బ్రాండ్స్ ను ప్రమోట్ చేశామని.. అవి లీగల్ కూడా అని చెప్పారు. అలానే మహిళలు కూడా మందు కొడతారని.. చిల్ అవుతారని.. మేమూ మనుషులమే అంటూ డైలాగ్స్ కొట్టింది. విమర్శించే వాళ్లకు ప్రతీ విషయం కూడా సమస్యగా కనిపిస్తుందని..
వాళ్లను పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది. మహిళలు అందంగా, ఆకర్షణీయంగా, శక్తివంతంగా ఉన్నారు కాబట్టే బ్రాండ్స్ వాళ్లను వెతుక్కుంటూ వస్తున్నాయని మరో హీరోయిన్ నైనా గంగూలీ పేర్కొన్నారు. మొత్తానికి పాయల్ చేసిన ఈ మందు కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.